Meta Layoffs: మరోసారి ఉద్యోగులకు షాకివ్వనున్న ఫేస్‍బుక్ కంపెనీ మెటా-meta to plans to 1000 more jobs this week more in future ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Meta To Plans To 1000 More Jobs This Week More In Future

Meta Layoffs: మరోసారి ఉద్యోగులకు షాకివ్వనున్న ఫేస్‍బుక్ కంపెనీ మెటా

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 07, 2023 09:45 AM IST

Meta Layoffs: ఫేస్‍బుక్ పేరెంట్ కంపెనీ మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపును చేపట్టనుంది. తాజాగా సుమారు 1000 మందికి ఆ సంస్థ ఉద్వాసన పలుకుతుందని సమాచారం బయటికి వచ్చింది.

Meta Layoffs: మరోసారి ఉద్యోగులకు షాకివ్వనున్న ఫేస్‍బుక్ కంపెనీ మెటా
Meta Layoffs: మరోసారి ఉద్యోగులకు షాకివ్వనున్న ఫేస్‍బుక్ కంపెనీ మెటా (AFP)

Meta Layoffs: ఫేస్‍బుక్, వాట్సాప్, ఇన్‍స్టాగ్రామ్ ప్లాట్‍ఫామ్‍ల పేరెంట్ కంపెనీ మెటా మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. మరోసారి ఉద్యోగులను తొలగింపు (Meta Jobs Cut) చేయనుంది. కంపెనీలో సుమారు 1000 మందిని ఉద్యోగాల నుంచి తీసేసేందుకు మెటా నిర్ణయించుకుందని బ్లూమ్‍బర్గ్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ వారంలోనే ఈ లేఆఫ్స్ ఉండనున్నాయని పేర్కొంది. గతేడాది 11,000 మంది ఎంప్లాయిస్‍ను తొలగించిన మెటా.. తాజాగా మరో 1,000 మందికి ఉద్వాసన పలకనుంది. వివరాలివే..

అత్యవసరం కానీ టీమ్‍లను పూర్తిగా తొలగించాలని మెటా భావిస్తోంది. ఇందుకోసం మేనేజర్లకు బైఔట్ ప్యాకేజీలు ఇచ్చేందుకు నిర్ణయించింది. భవిష్యత్తులోనూ ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. వేలాది మంది ఎంప్లాయిస్‍పై ఈ ప్రభావం పడనుందని తెలుస్తోంది.

రెవెన్యూ తగ్గడంతో..

Meta Layoffs: అడ్వర్టయిజ్‍మెంట్ల నుంచి ఆదాయం తగ్గడంతో ఆర్థిక లక్ష్యాలను మెటా చేరుకోలేకపోతోంది. ఈ కారణంతోనే మరోసారి ఉద్యోగుల తొలగింపునకు ఆ సంస్థ సిద్ధమైందని సంబంధింత వర్గాలు వెల్లడించినట్టు బ్లూమ్‍బర్గ్ పేర్కొంది. అలాగే వర్చువల్ రియాలిటీ ప్లాట్‍ఫామ్ ‘మెటావర్స్’పై కూడా ఎక్కువ దృష్టి పెట్టాలని మెటా ఆలోచిస్తోంది. ఇందుకోసం కొన్ని విభాగాల్లో పునర్‌వ్యస్థీకరణ అవసరమని భావిస్తోంది. తీసేయగలిగిన ఉద్యోగుల జాబితాను తయారు చేయాలని వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లను మెటా కోరుతోందని తెలుస్తోంది. అయితే తాజా లేఆఫ్స్ గురించి ఆ సంస్థ ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ త్వరలో మూడో సంతానం పొందనున్నారు. ఇందుకోసం ఆయన పేరెంటల్ లీవ్ తీసుకోనున్నారు. అయితే ఆయన సెలవుల్లోకి వెళ్లకముందే ఈ తాజా లేఆఫ్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ వారం లేదా వచ్చే వారంలో ఉద్యోగుల తొలగింపుపై అధికారిక ప్రకటన వస్తుందని అంచనాలు ఉన్నాయి.

Meta Layoffs: గతేడాది నవంబర్‌లో సంస్థలో 13 శాతం మంది సిబ్బంది అంటే 11,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు మెటా ప్రకటించింది. ఆ కంపెనీ చరిత్రలో ఈ స్థాయిలో లేఆఫ్స్ చేయడం అదే తొలిసారి. ఆదాయం తగ్గడం, ఆర్థిక అనిశ్చితి, ఆర్థిక మాంద్యం భయాలతో ఎంప్లాయిస్‍ను మెటా తొలగించింది. అయితే అనూహ్యంగా తాజాగా మరో వెయ్యి మందిని తీసేసేందుకు సిద్ధమైంది.

Layoffs: మెటాతో పాటు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఐబీఎం, హెచ్‍పీ సహా మరిన్ని దిగ్గజ సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తీసేశాయి. వందలాది సంస్థలు ఉద్యోగాలను లేఆఫ్స్ చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా టెక్ కంపెనీలు ఎక్కువగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం