Gold Price Today: మరింత దిగొచ్చిన బంగారం రేటు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా!-gold rate today down silver price cools check latest prices on 24th may in telugu states delhi bengaluru and more cities ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Price Today: మరింత దిగొచ్చిన బంగారం రేటు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా!

Gold Price Today: మరింత దిగొచ్చిన బంగారం రేటు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా!

Gold Price Today: పసిడి ధర మరింత దిగొచ్చింది. వెండి రేటు కూడా తగ్గింది. హైదరాబాద్ సహా వివిధ సిటీల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా.. (PTI)

Gold Rate Today: దేశీయ మార్కెట్‍లో పసిడి ధర మరింత దిగొచ్చింది. వరుసగా రెండో రోజు రేటు తగ్గింది. బుధవారం ఉదయం సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.290 తగ్గి రూ.56,000కు చేరింది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల (తులం) గోల్డ్ రేటు రూ.310 క్షీణించి రూ.61,100కు దిగివచ్చింది. వెండి ధర (Silver) కూడా నేడు మోస్తరుగా తగ్గింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ నగరాల్లో పసిడి, వెండి రేట్లు (Gold, Silver Rates) ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధర తగ్గింది. హైదరాబాద్‍‍‍లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.56,000కు దిగివచ్చింది. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.61,100కు చేరింది. ఆంధ్రప్రదేశ్‍లోని విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

Gold Price Today: ఢిల్లీతో పాటు ప్రధాన నగరాల్లో..

Gold Price Today: దేశ రాజధాని ఢిల్లీ సహా ఇతర సిటీల్లోనూ పసిడి ధర దిగొచ్చింది. ఢిల్లీలో 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం 10 గ్రాముల రేటు రూ.56,150కు చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,250కు వచ్చింది.

Gold Rate Today: కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు అహ్మదాబాద్‍లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.56,050కు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.61,150కు చేరింది.

ముంబై, కోల్‍కతాలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.56,000గా ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.61,100కు చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.56,450కు రాగా.. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.61,580కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్‍లో ఇలా..

Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్‍లో గత 24 గంటల్లో స్పాట్ గోల్డ్ ధర కాస్త స్థిరంగా ఉంది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 1,975 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇటీవల కాస్త డిమాండ్ తగ్గటంతో ప్రపంచ మార్కెట్‍లో బంగారం ధరలు దిగొస్తున్నాయి. మరోవైపు ద్రవ్యోల్బణం, డాలర్ విలువలో ఒడిదొడుకులు కూడా గోల్డ్ రేట్లపై ప్రభావం చూపిస్తున్నాయి.

వెండి కూడా డౌన్

Silver Rate Today: దేశంలో వెండి ధర కూడా కిందికి వచ్చింది. కిలో వెండి రేటు రూ.500 తగ్గి రూ.74,500కు దిగొచ్చింది. మరోసారి రూ.75వేల దిగువకు చేరింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి సిటీల్లో కిలో వెండి రేటు రూ.78,000కు చేరింది. ఢిల్లీ, కోల్‍కతా, ముంబైల్లో కిలో వెండి ధర రూ.74,500కు తగ్గింది.

(గమనిక: ఈ ధరల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణనలోకి తీసుకోలేదు.)