Gold Rate Today: మళ్లీ పెరిగిన పసిడి ధర.. తగ్గిన వెండి రేటు-gold price rises again silver rate down check latest prices ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  Gold Price Rises Again Silver Rate Down Check Latest Prices

Gold Rate Today: మళ్లీ పెరిగిన పసిడి ధర.. తగ్గిన వెండి రేటు

Gold Rate Today: మళ్లీ పెరిగిన పసిడి ధర.. తగ్గిన వెండి రేటు
Gold Rate Today: మళ్లీ పెరిగిన పసిడి ధర.. తగ్గిన వెండి రేటు (MINT_PRINT)

Gold Price Today: బంగారం ధర మళ్లీ పెరుగుదల బాటపట్టింది. వెండి రేటు మాత్రం మరింత తగ్గింది. వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.

వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం ధర మరోసారి పెరుగుదల బాటపట్టింది. దేశంలో గురువారం 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల (తులం) గోల్డ్ ధర రూ.250 పెరిగి రూ.56,250కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.260 అధికమై రూ.61,360కు ఎగబాకింది. మరోవైపు, దేశీయ మార్కెట్లో వెండి రేట్లలో తగ్గుదల కొనసాగింది. సిల్వర్ మరింత దిగొచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ట్రెండింగ్ వార్తలు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.56,400కు పెరిగింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.61,510కు చేరింది.

హైదరాబాద్‍‍‍లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల పసిడి ధర రూ.56,250కు ఎగబాకింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల రేటు రూ.61,360కు వెళ్లింది. ఆంధ్రప్రదేశ్‍లోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

ఆభరణాలకు ఉపయోగించే 22 క్యారెట్లకు చెందిన బంగారం 10 గ్రాముల రేటు బెంగళూరులో రూ.56,300కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.61,410కు పెరిగింది. అహ్మదాబాద్, పట్నాలోనూ ఇవే ధరలు నమోదయ్యాయి.

తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేటు రూ.56,650గా ఉంది. ఆ సిటీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,800కు ఎగిసింది. కోల్‍కతా, ముంబై నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి వెల రూ.56,250కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.61,360కు పెరిగింది.

ప్రపంచ మార్కెట్‍లో బంగారం ధర కాస్త తగ్గింది. అమెరికాలో రుణ గరిష్ట పరిమితిపై ప్రభుత్వం చర్చలు జరుపుతున్న నేపథ్యంలో మదుపరులు బంగారంలో పెట్టుబడులపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్‍లో స్పాట్ గోల్డ్ ధర ఊగిసలాడుతోంది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 1,959 వద్ద ట్రేడ్ అవుతోంది. ద్రవ్యోల్బణం కూడా బంగారం రేటుపై ఎఫెక్ట్ చూపిస్తోంది.

మరింత తగ్గిన వెండి

దేశీయ మార్కెట్‍లో పసిడి ధర పెరగగా.. వెండి మాత్రం తగ్గింది. కిలో వెండి రేటు రూ.450 దిగొచ్చి రూ.74,050కు చేరింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, తిరుపతి నగరాల్లో కిలో వెండి ధర రూ.77,500కు వచ్చింది. కోల్‍కతా, ఢిల్లీ, ముంబై సిటీల్లో కేజీ వెండి రేటు రూ.74,050కు దిగొచ్చింది.

(గమనిక: ఈ ధరల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణనలోకి తీసుకోలేదు.)