Gold Silver Rate Today: పసిడి ప్రియులకు షాక్… భారీగా పెరిగిన బంగారం ధర-gold and silver rate today 5 october 2022 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Rate Today 5 October 2022

Gold Silver Rate Today: పసిడి ప్రియులకు షాక్… భారీగా పెరిగిన బంగారం ధర

Mahendra Maheshwaram HT Telugu
Oct 05, 2022 06:55 AM IST

Today Gold and Silver Price: కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. అయితే మంగళవారం ధరలు పెరగగా... ఇవాళ కూడా అదే బాటలో నడిచాయి. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 51,660గా నమోదైంది. మరోవైపు ఇవాళ వెండి రేటు పెరిగింది.

బంగారం వెండి ధరలు
బంగారం వెండి ధరలు

Gold silver price today 05 october 2022: బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా.. ధరలు పైపైకి వెళ్లాయి. మంగళవారం ధరలు ఎగబాకగా... ఇవాళ కూడా భారీగా పెరిగాయి. 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారంపై రూ. 500 పె.. 24 క్యారెట్లపై రూ. 550 ఎగబాకింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 51,660గా నమోదైంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

22 క్యారెట్ల బంగారం రేటు రూ. 47,350 వద్ద కొనసాగుతోంది. ఇక ఇవాళ కిలో వెండిపై రూ. 440 తగ్గి ...హైదరాబాద్ మార్కెట్ కిలో వెండి ధర రూ.66,700గా ఉంది

Gold silver price today: ఏపీలో ఇలా…

gold silver prices in ap: విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.47,350గా ఉంది. 24 క్యారెట్స్ బంగారం ధర 51,660గా నమోదైంది. ఇక్కడ వెండి ధర కిలో రూ. 66,700 వద్ద కొనసాగుతోంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,660గా ఉంది.

Gold silver price: పలు నగరాల్లో ఇలా..

gold and silver rate in india: దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరల్లో వ్యత్యాసం ఉంది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100గా ఉంది.

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,660గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,500గా ఉంటే… 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,820 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,400గా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,710 వద్ద ఉంది. ఇక కోల్ కత్తాలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 51,660గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,350 వద్ద కొనసాగుతోంది.

Platinum Price today: ప్లాటినం ధరలు ఇలా..

ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 1060 చొప్పున పెరిగింది. హైదరాబాద్‌లో ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 23,700గా ఉంది. విజయవాడలో, విశాఖపట్నంలోనూ ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 23,700గా ఉంది.

ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉన్నాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనే రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల వంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తున్నాయి.

WhatsApp channel