Elon Musk net worth : రోజుకు రూ. 2500కోట్లు కోల్పోతున్న అపర కుబేరుడు!-elon musk loses 2 500 crore every day this year amid twitter troubles ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Elon Musk Loses 2,500 Crore Every Day This Year Amid Twitter Troubles

Elon Musk net worth : రోజుకు రూ. 2500కోట్లు కోల్పోతున్న అపర కుబేరుడు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 22, 2022 11:55 AM IST

Elon Musk net worth : ఎలాన్​ మస్క్​ సంపద.. ఈ ఏడాది భారీ మొత్తంలో కరిగిపోతోంది. ఆయన రోజుకు రూ. 2,500కోట్లు నష్టపోతున్నారు!

రోజుకు రూ. 2500కోట్లు కోల్పోతున్న అపర కుబేరుడు!
రోజుకు రూ. 2500కోట్లు కోల్పోతున్న అపర కుబేరుడు!

Elon Musk net worth : ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్​ మస్క్​కు ఈ ఏడాది కలిసి రావడం లేదు! టెస్లా షేర్లు.. రెండేళ్ల కనిష్ఠానికి పడిపోవడంతో.. ఎలాన్​ మస్క్​కు ఈ ఏడాది ఇప్పటికే 100బిలియన్​ డాలర్ల నష్టం వాటిల్లింది. బ్లూమ్​బర్గ్​ వెల్త్​ ఇండెక్స్​లో ఉన్న మరే ఇతర ధనవంతుడు కూడా ఇంత భారీగా ఈ ఏడాది నష్టపోలేదు.

ట్రెండింగ్ వార్తలు

రోజుకు రూ. 2,500కోట్లు నష్టం..!

బ్లూమ్​బర్గ్​ బిలియనీర్స్​ ఇండెక్స్​ ప్రకారం.. టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​ సంపద.. 2022లో 37శాతం (101 బిలియన్​ డాలర్లు) పతనమైంది. అంటే.. ఆయన రోజకు రూ. 2,500కోట్లు కోల్పోతున్నట్టు అర్థం. ఫలితంగా 2022 నవంబర్​ 22 నాటికి ఎలాన్​ మస్క్​ నెట్​ వర్త్​ 170బిలియన్​ డాలర్లకు చేరింది.

Elon Musk twitter : ప్రపంచంలో ధనవంతుల ర్యాంకులు, వారి సంపదను వివరించేదే ఈ బ్లూమ్​బర్గ్​ బిలియనీర్స్​ ఇండెక్స్​. వాల్​స్ట్రీట్​లో ట్రేడింగ్​ సెషన్​ ముగిసిన తర్వాత.. ప్రతి రోజు ఈ బ్లూమ్​బర్గ్​ బిలియనీర్స్​ ఇండెక్స్​ అప్డేట్​ అవుతూ ఉంటుంది.

టెస్లాలో సమస్యలు..!

అమెరికాలోని 3,21,000 వాహనాలను టెస్లా రీకాల్​ చేసింది. కొన్ని రోజుల క్రితమే.. 30వేలకుపైగా మోడల్​ ఎక్స్​ వాహనాలను రీకాల్​ చేసింది ఈ ఆటో సంస్థ. వాహనాల్లో లోపాల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా.. టెస్లా షేర్లు తాజాగా 3శాతం పతనమై.. రెండేళ్ల కనిష్ఠానికి చేరాయి. 17 నెలల పాటు బుల్లిష్​ ర్యాలీని కొనసాగించిన టెస్లా స్టాక్​.. ఇప్పుడు విపరీతంగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది.

Elon Musk Telsa share :ఎలాన్​ మస్క్​ సీఈఓగా ఉన్న ఈ టెస్లా సంస్థ.. ఎలక్ట్రిక్​ వాహనాలు, సోలార్​ బ్యాటరీలను తయారు చేస్తుంది. ఇక ఎలాన్​ మస్క్​ సీఈఓగా ఉన్న స్పేస్​ఎక్స్​.. రాకెట్లను తయారు చేస్తుంది. ఇటీవలే.. తన వ్యాపార సామ్రాజ్యంలోకి ట్విట్టర్​ను కూడా యాడ్​ చేసుకున్నారు ఎలాన్​ మస్క్​. 44 బిలియన్​ డాలర్లు వెచ్చించి మరీ ట్విట్టర్​ను సొంతం చేసుకున్నారు. నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ట్విట్టర్​ భవితవ్యం ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది.

కాస్ట్​ కటింగ్​ పేరుతో వేలాది మంది ఉద్యోగులను ట్విట్టర్​ నుంచి తొలగించారు మస్క్​. మరికొందరు.. స్వచ్ఛందంగానే తప్పుకుంటున్నారు. ఈ పరిణామాలు ట్విట్టర్​తో పాటు అమెరికాను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇతర సంస్థల్లో కూడా లేఆఫ్​లు పెరుగుతుండటంతో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి.

Elon Musk buys Twitter : ఈ పరిణామాల మధ్య.. ఎలాన్​ మస్క్​ నెట్​ వర్త్​.. సమీప కాలంలో మరింత పతనవ్వచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్