Twitter office shut down : ట్విట్టర్​ ఆఫీసు మూసివేత.. మస్క్​కు ఉద్యోగులు షాక్​!-twitter shuts offices after mass resignations see what it told employees ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Twitter Shuts Offices After Mass Resignations, See What It Told Employees

Twitter office shut down : ట్విట్టర్​ ఆఫీసు మూసివేత.. మస్క్​కు ఉద్యోగులు షాక్​!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 18, 2022 10:52 AM IST

Twitter office shut down : అమెరికాలోని ట్విట్టర్​ కార్యాలయం తాత్కాలికంగా మూతపడింది. మస్క్​ అల్టిమేటంతో.. ఉద్యోగులు మూకుమ్మడి రాజీనామాలు చేయడమే ఇందుకు కారణం.

ట్విట్టర్​ కార్యాలయం
ట్విట్టర్​ కార్యాలయం (REUTERS/file)

Twitter office shut down : అపర కుబేరుడు ఎలాన్​ మస్క్​ ఎంట్రీతో.. రోజుకో వ్యవహారంతో వార్తల్లో నిలుస్తోంది ట్విట్టర్​. తాజాగా.. ట్విట్టర్​ ఉద్యోగులు మూకుమ్మడి రాజీనామాలు చేసినట్టు తెలుస్తోంది. ఫలితంగా అమెరికాలోని ట్విట్టర్​ కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్టు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

ఏం జరిగింది..?

ట్విట్టర్​ను తన సొంతం చేసుకున్న ఎలాన్​ మస్క్​.. సంస్థలో అనేక మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ట్విట్టర్​ ఉద్యోగులను తొలగించారు. అదే సమయంలో .. ఉన్న వారికి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు.

"ట్విట్టర్​లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. మీరు సంస్థలో పని చేయాలని అనుకుంటే.. కఠినమైన సవాళ్ల మధ్య ఉద్యోగం చేస్తున్నట్టే భావించాలి. సంస్థను సరైన మార్గంలో నడిపించేందుకు ఇది తప్పదు. దీనికి కట్టుబడి ఉంటేనే ఉద్యోగంలో ఉండండి.. లేదా వెళిపోండి," అని.. ట్విట్టర్​ ఉద్యోగులకు ఇటీవలే అల్టిమేటం జారీ చేశారు ఎలాన్​ మస్క్​. ఓ ఫామ్​ను ఇచ్చి.. గురువారం సాయంత్రంలోపు ఫిల్​ చేయాలని చెప్పారు మస్క్​. ఫామ్​ను సబ్మీట్​ చేయకపోతే.. మూడు నెలల జీతాన్ని తీసుకుని సంస్థ నుంచి వెళ్లిపోవాలని తేల్చిచెప్పారు.

Elon Musk Twitter : ఈ పరిణామాలతో ఎలాన్​ మస్క్​కు ట్విట్టర్​ ఉద్యోగులు షాక్​ ఇచ్చినట్టు కనిపిస్తోంది. చాలా మంది ట్విట్టర్​ ఉద్యోగులు.. మూకుమ్మడిగా రాజీనామాలు చేసేసినట్టు సమాచారం. మస్క్​ ఊహించిన దాని కన్నా ఈ సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

"క్రిటికల్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ విభాగానికి చెందిన పూర్తి బృందం రాజీనామా చేసింది. మేము వెళ్లిపోతే.. సంస్థ కోలుకోవడం ఇంకా కష్టమవుతుంది. మాకు నైపుణ్యం ఉంది. మాకు చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ట్విట్టర్​లో కొనసాగేందుకు.. మాకు కారణాలు కనిపించడం లేదు," అని ఓ సంస్థ ఉద్యోగి పేర్కొన్నారు.

అయితే.. మస్క్​ అల్టిమేటం తర్వాత ఎంత మంది ఉద్యోగులు సంస్థకు గుడ్​ బై చెప్పారు అన్నది తెలియలేదు. ఈ పరిణామాల మధ్య అమెరికా ట్విట్టర్​ కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఎవరికి యాక్సెస్​ ఇవ్వాలి? ఎవరికి ఇవ్వకూడదు? అన్న సందిగ్దంలో ఉన్న సంస్థ.. చివరికి.. ఈ నెల 21 వరకు కార్యాలయాన్ని మూసివేయడమే మంచిదని నిర్ణయించుకుంది.

Twitter layoffs 2022 : "ట్విట్టర్​ ఆఫీసును మూసివేస్తున్నాము. ఉద్యోగుల బ్యాడ్జీలను సస్పెండ్​ చేస్తున్నాము. సోమవారం ఆఫీసు తిరిగి తెరుచుకుంటుంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయి. మీ ఫ్లెక్సిబులిటీకి ధన్యవాదాలు. సంస్థలోని రహస్య సమాచారాన్ని సోషల్​ మీడియాలో పంచుకోరు అని మేము ఆశిస్తున్నాము," అని ఓ మెమోను విడుదల చేసింది ట్విట్టర్​.

'నాకేం ప్రాబ్లం లేదు..'

ట్విట్టర్​లో మూకుమ్మడి రాజీనామాల వ్యవహారంపై చాలా కూల్​గా స్పందించారు ఎలాన్​ మస్క్​. ఈ రాజీనామాలతో తాను ఇబ్బండి పడటం లేదన్నారు.

"అత్యంత ప్రతిభావంతులైన వారు సంస్థలో ఉంటున్నారు. ఎంతమంది వెళ్లిపోయినా నాకు చింత ఉండదు," అని అర్థం వచ్చే విధంగా ట్వీట్​ చేశారు ఎలాన్​ మస్క్​.

Twitter resignations Musk : అయితే.. మస్క్​ ప్లాన్​ బెడిసి కొట్టినట్టు కనిపిస్తోంది! ప్రస్తుత కాలంలో ఉద్యోగులు.. జాబ్స్​ని వదులుకోకుండా.. కఠిన నిబంధనల మధ్య పనిచేసేందుకు మొగ్గుచూపుతారని మస్క్​ భావించినట్టు సమాచారం. కానీ భారీ మొత్తంలో ఉద్యోగులు రాజీనామాలు చేయడంతో ఆయన షాక్​కు గురైనట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే.. ఉద్యోగుల్లో చాలా మందిని సంస్థలో ఉండేందుకు ప్రోత్సహించే విధంగా ఆయన.. చివరి నిమిషంలో ప్రయత్నించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ముఖ్యమైన సిబ్బందిని గురువారం మీటింగ్​కు పిలిపించిన మస్క్​.. ఈ మేరకు వారితో మాట్లాడినట్టు పేర్కొన్నాయి.

ఈ క్రమంలోనే తన కఠిన నిబంధనలను తగ్గించుకునే యోచనలో ఉన్నట్టు కూడా.. ఉద్యోగులకు మస్క్​ మెయిల్​ చేసినట్టు తెలుస్తోంది. కానీ అవేవీ.. ఉద్యోగులను ఆపలేదు!

మరోవైపు ట్విట్టర్​ ఉద్యోగులు సోషల్​ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. #RIPTWITTER పేరుతో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం