DCX Systems IPO: సోమవారం నుంచి DCX Systems IPO.. అప్లై చేయొచ్చో లేదో చూడండి!-dcx systems ipo opens on monday gmp review other details apply or not ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Dcx Systems Ipo Opens On Monday. Gmp, Review, Other Details. Apply Or Not?

DCX Systems IPO: సోమవారం నుంచి DCX Systems IPO.. అప్లై చేయొచ్చో లేదో చూడండి!

HT Telugu Desk HT Telugu
Oct 29, 2022 07:26 PM IST

DCX Systems IPO: సోమవారం నుంచి DCX Systems IPO ఒపెన్ అవుతోంది. ప్రస్తుతం ఈ IPO షేరు గ్రే మార్కెట్లో శనివారం రూ. 90 ప్రీమియంతో ట్రేడ్ అవుతోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Photo: Courtesy DCX Systems Ltd website)

DCX Systems IPO: సోమవారం, 31, అక్టోబర్, 2022న DCX Systems Limited IPO సెకండరీ మార్కెట్లో ఓపెన్ అవుతోంది. నవంబర్ 2 వరకు ఈ ఐపీఓకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ IPO లో షేరు ధరల శ్రేణిని రూ. 197 నుంచి రూ. 207 మధ్య నిర్ధారించారు. అయితే, శనివారమే ఈ షేరు గ్రే మార్కెట్లో రూ. 90 ప్రీమియంతో ట్రేడ్ కావడం విశేషం.

DCX Systems IPO: ఏంటీ DCX Systems Limited?

రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో ఈ సంస్థ బలంగా ఉంది. భారత్ లో ఈ రంగాలకు అభివృద్ధ అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. ఇటీవలనే రక్షణ రంగంలో ఎఫ్ డీఐ వాటాను 49% నుంచి 74 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎలక్ట్రానిక్ సబ్ సిస్టమ్స్, కేబుల్ హార్నెస్ లను ఉత్పత్తి చేసే ఈ సంస్థకు ఇజ్రాయెల్, యూఎస్, యూకే, దక్షిణ కొరియాల్లో లో కస్లమర్లున్నారు. వాటిలో ఫార్చున్ 500 సంస్థలు కూడా ఉన్నాయి. నిపుణుల విశ్లేషణ ప్రకారం IPO ఇష్యూ ప్రైస్ కూడా సహేతుకంగానే ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడి ఉద్దేశంతో దీనికి సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

DCX Systems IPO: ఈ ఐపీఓ పూర్తి వివరాలు ఇవిగో..

  • ప్రైస్ బ్యాండ్ రూ. 197 నుంచి రూ. 207
  • శనివారం ఈ షేరు జీఎంపీ (grey market premium -GMP) రూ. 90.
  • లాట్ సైజ్ 72 షేర్లు.
  • ఈ ఐపీఓ ద్వారా రూ. 500 కోట్లను సమకూర్చుకోవాలని సంస్థ ప్రణాళిక. ఇందులో రూ. 100 కోట్లు OFS (Offer for Sale) ద్వారా సమకూర్చుకుంటారు.
  • షేర్ల అలాట్ మెంట్ నవంబర్ 7వ తేదీన. NSE, BSE ల్లో లిస్ట్ అయ్యే తేదీ నవంబర్ 11.
  • ఈ IPO అధికారిక రిజిస్ట్రార్ Link Intime India Private Ltd.

WhatsApp channel