Stocks to buy today : ట్రేడర్స్​ జోన్​.. నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే!-day trading guide for today 6 stocks to buy or sell on monday 28th november ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Day Trading Guide For Today: 6 Stocks To Buy Or Sell On Monday 28th November

Stocks to buy today : ట్రేడర్స్​ జోన్​.. నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 28, 2022 07:25 AM IST

Stocks to buy today : ట్రేడర్స్​.. నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ లిస్ట్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు.

నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే..
నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 20పాయింట్ల లాభంతో 62,293 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 28 పాయింట్లు పెరిగి 18,512 వద్ద ముగిసింది. 91పాయింట్ల నష్టంతో 43,000 మార్కు దిగువన స్థిరపడింది బ్యాంక్​ నిఫ్టీ.

ట్రెండింగ్ వార్తలు

స్టాక్​ మార్కెట్​ నిపుణులు ప్రకారం.. నిఫ్టీ వీక్లీ ఛార్ట్​లో బుల్లిష్​ క్యాండిల్​ ఏర్పడింది. 18,100 లెవల్స్​ను దాటిన తర్వాత.. 18400 వరకు ర్యాలీ అయ్యి.. దానిని కూడా బ్రేక్​ చేసి ట్రేడ్​ అవుతోంది. నిఫ్టీ సెంటిమెంట్​ పాజిటివ్​గా ఉంది.

Stock market news today : "నిఫ్టీ ట్రెండ్​ పాజిటివ్​గానే ఉంది. గత వారంలో కీలకమైన రెసిస్టెన్స్​ను నిఫ్టీ బ్రేక్​ చేసింది. ఈ వారం.. ఆల్​టైమ్​ హై అయిన 18,606 మార్కును నిఫ్టీ దాటుతుందని భావిస్తున్నాము. 18,600 పైన స్థిరపడితే.. నిఫ్టీలో 18,950 వరకు ర్యాలీ ఉండొచ్చు," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి పేర్కొన్నారు.

"బ్యాంకింగ్​, ఐటీ, పీఎస్​యూ స్టాక్స్​ పెరగడంతో మార్కెట్లు వృద్ధిచెందుతున్నాయి. మిడ్​ క్యాప్​, స్మాల్​ క్యాప్​లో ఇంకా ర్యాలీ రాలేదు. ఆ సూచీలు ఇంకా కన్సాలిడేషన్​ దశలోనే ఉన్నాయి. గత వారం చివర్లో పరిస్థితులు కాస్త సానుకూలంగా కనిపించాయి. టెక్నికల్స్​ గురించి మాట్లాడుకుంటే.. హయ్యర్​ హైస్​, హయ్యర్​ లోస్​ పాటర్న్​ కొనసాగుతోంది. కీలకమైన సపోర్టులు బ్రేక్​ చేస్తే తప్ప.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు," అని 5పైసా.కామ్​ లీడ్​ రీసెర్చ్​ రుచిత్​ జైన్​ అన్నారు.

స్టాక్​ మార్కెట్లు పెరుగుతున్నా.. మీ పోర్ట్​ఫోలియో వృద్ధిచెందడం లేదా? అసలు కారణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఎస్​జీఎక్స్​ నిఫ్టీ..

దేశీయ స్టాక్​ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ దాదాపు 60 పాయింట్ల నష్టంలో ఉండటమే ఇందుకు కారణం.

అమెరికా మార్కెట్లు.. శుక్రవారం ఫ్లాట్​గా ముగిశాయి. డౌ జోన్స్​ 0.46శాతం లాభపడింది. ఎస్​ అండ్​ పీ500 0.03శాతం, నాస్​డాక్​ 0.52శాతం నష్టపోయాయి.

స్టాక్స్​ టు బై..

  • Stocks to buy : దివీస్​ ల్యాబ్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 3270, టార్గెట్​ రూ. 3450
  • ఐషేర్​ మోటార్స్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 3350, టార్గెట్​ రూ. 3500
  • విప్రో:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 388, టార్గెట్​ రూ. 425
  • పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 47, టార్గెట్​ రూ. 63
  • బిర్లాసాఫ్ట్​: బై రూ. 294, స్టాప్​ లాస్​ రూ. 284, టార్గెట్​ రూ. 309
  • మథర్​సన్​:- బై రూ. 73.50, స్టాప్​ లాస్​ రూ. 71.60, టార్గెట్​ రూ. 78

(గమనిక:- ఇవి నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel

సంబంధిత కథనం