Stock market news today :ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 8 పాయింట్ల నష్టం-stock market news today sensex and nifty indices open on a flat note ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today, Sensex And Nifty Indices Open On A Flat Note

Stock market news today :ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 8 పాయింట్ల నష్టం

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 25, 2022 09:19 AM IST

Stock market news today : దేశీయ సూచీలు ఫ్లాట్​గా ఓపెన్​ అయ్యాయి. అమెరికా మార్కెట్లకు సెలవు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్​ అవుతున్నాయి.

ఇండియా స్టాక్​ మార్కెట్​
ఇండియా స్టాక్​ మార్కెట్​

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 18పాయింట్ల నష్టంతో 62,255 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 8పాయింట్లు కోల్పోయి 18,476 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతల కారణంగా దేశీయ సూచీలు.. గురువారం లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా సెన్సెక్స్​.. రికార్డు గరిష్ఠాన్ని తాకింది. 762 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్​.. 62,272 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 217పాయింట్ల లాభంతో 18,484 వద్ద ముగిసింది. బ్యాంక్​ నిఫ్టీ.. 346 పాయింట్లు పెరిగి.. 43,075కు చేరింది. ఇది కూడా ఆల్​ టైమ్​ హైయే. ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 62,328 - 18,529 వద్ద మొదలుపెట్టాయి.

పివొట ఛార్ట్స్​ ప్రకారం.. నిఫ్టీ సపోర్ట్​ 18,346- 18,290 లెవల్స్​ వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్​.. 18,526- 18581 వద్ద ఉంది.

స్టాక్స్​ టు బై..

  • Stocks to buy : మారుతీ సుజుకీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 8800, టార్గెట్​ రూ. 9,200
  • టెక్​ మహీంద్రా:- బై రూ. 1100, స్టాప్​ లాస్​ రూ. 1050
  • ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​ లిమిటెడ్​ (ఐఓసీ):- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 69, టార్గెట్​ రూ. 80
  • యూనియన్​ బ్యాంక్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 72, టార్గెట్​ రూ. 90

లాభాలు.. నష్టాలు..

ఇండస్​ఇండ్​, ఎల్​టీ, యాక్సిస్​ బ్యాంక్​, ఎయిర్​టెల్​, హెచ్​సీఎల్​ టెక్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

పవర్​ గ్రిడ్​, బజాజ్​ ఫినాన్స్​, ఇన్ఫీ, హెచ్​యూఎల్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు..

Stock market latest news : సెలవు దినం కావడంతో అమెరికా స్టాక్​ మార్కెట్లు గురువారం పని చేయలేదు. మరోవైపు.. ఆసియా మార్కెట్లు.. మిశ్రమంగా ఉన్నాయి. జపాన్​ నిక్కీ 0.32శాతం, సౌత్​ కొరియా 0.22శాతం పతనమయ్యాయి. అదే సమయంలో ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200 0.15శాతం పెరిగింది.

చమురు ధరలు..

చమురు ధరలు మళ్లీ పడ్డాయి. 29సెంట్లు పడిన బ్రెంట్​ క్రూడ్​.. 85.12 డాలర్లలకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

Sensex all time high : గురువారం ట్రేడింగ్​ సెషన్​లో రూ. 1,231.8కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు ఎఫ్​ఐఐలు. అదే సమయంలో.. రూ. 235.66కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు డీఐఐలు.

WhatsApp channel

సంబంధిత కథనం