Stocks to buy today : స్టాక్స్ టు బై- రిలయన్స్, విప్రో షేర్ ప్రైజ్ టార్గెట్స్..
Stocks to buy today : ట్రేడర్స్ నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 23 పాయింట్లు పెరిగి 59,655కి చేరింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్లాట్‌గా 17,624 వద్ద స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 151 పాయింట్లు కోల్పోయి 42,118 వద్ద ముగిసింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ షార్ట్ టర్మ్ ట్రెండ్ నెగిటివ్‌గా ఉంది.
"నిఫ్టీ షార్ట్ టర్మ్ ట్రెండ్ వీక్‌గా ఉంది. ఈ వారం కూడా వీక్నెస్ కొనసాగవచ్చు. 17600- 17550 లెవల్స్ బ్రేక్ అయితే నిఫ్టీ మరింత పతనమయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్ 17,700 దగ్గర ఉంది," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
Stock market new today : శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2116.76 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1632.66 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ను దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్..
US Stock market investment : అమెరికా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.07శాతం, ఎస్ అండ్ పీ 500 0.09శాతం, నాస్డాక్ 0.11శాతం మేర లాభపడ్డాయి.
స్టాక్స్ టు బై..
బ్రిటానియా ఇండస్ట్రీస్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 4250, టార్గెట్ రూ. 4450
పిడిలైట్ ఇండస్ట్రీస్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 2400, టార్గెట్ రూ. 2500- రూ. 2525
Wipro share price target : విప్రో:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 344, టార్గెట్ రూ. 395
Reliance share price target : రిలయన్స్ ఇండస్ట్రీస్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 2285, టార్గెట్ రూ. 2420
టీసీఎస్:- బై రూ. 3160, స్టాప్ లాస్ రూ. 3120, టార్గెట్ రూ. 3220
HDFC share price target : హెచ్డీఎఫ్సీ:- బై రూ. 2760, స్టాప్ లాస్ రూ. 2730, టార్గెట్ రూ. 2810
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం