Stocks to buy today : ట్రేడర్స్​.. ఈ 6 స్టాక్స్​పై ఫోకస్​ చేస్తే మంచి లాభాలు!-day trading guide for today 6 stocks to buy or sell on monday 23rd january ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Day Trading Guide For Today: 6 Stocks To Buy Or Sell On Monday 23rd January

Stocks to buy today : ట్రేడర్స్​.. ఈ 6 స్టాక్స్​పై ఫోకస్​ చేస్తే మంచి లాభాలు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 23, 2023 07:27 AM IST

Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై లిస్ట్​
స్టాక్స్​ టు బై లిస్ట్​ (MINT)

Stocks to buy today : అమ్మకాల ఒత్తిడి కారణంగా దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టపోయాయి. నిఫ్టీ50.. 80 పాయింట్ల నష్టంతో 18,027 వద్ద ముగిసింది. బీఎస్​ఈ సెన్సెక్స్​236 పాయింట్ల నష్టంతో 60,621 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్​ స్టాక్స్​ మాత్రం లాభపడ్డాయి. ఫలితంగా బ్యాంక్​ నిఫ్టీ ఇండెక్స్​ 177 పాయింట్ల లాభంతో 42,506 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ వీక్లీ ఛార్ట్​లో నెగిటివ్​ క్యాండిల్​ ఏర్పడింది. మార్కెట్​లో కన్సాలిడేషన్​ దశ కొనసాగుతోందని ఇది సూచిస్తోంది. 18,200- 17,800 లెవల్స్​ మధ్యే నిఫ్టీ కన్సాలిడేట్​ అవుతోంది.

Stock market news : "షార్ట్​ టర్మ్​లో స్టాక్​ మార్కెట్​ మరింత పడొచ్చు. 17,900- 17,800 లెవల్స్​ కీలక సపోర్ట్​గా ఉన్నాయి. నిఫ్టీ అక్కడి వరకు వెళ్లి, పైకి బౌన్స్​ అవ్వొచ్చు. అదే సమయంలో 18,150- 18,200 లెవల్స్​ కీలక రెసిస్టెన్స్​గా ఉన్నాయి," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

ఎస్​జీఎక్స్​ నిఫ్టీ..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ.. దాదాపు 80 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

US Stock market news : అమెరికా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. డౌ జోన్స్​ 1శాతం, ఎస్​ అండ్​ పీ 500 1.89శాతం, నాస్​డాక్​ 2.69శాతం మేర లాభపడ్డాయి.

ఎఫ్​ఐఐలు.. డిఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2002.25కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1509.95కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

స్టాక్స్​ టు బై:-

గెయిల్​ ఇండియా:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 96, టార్గెట్​ రూ. 105

HDFC Bank share price target : హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్, స్టాప్​ లాస్​ రూ. 1630, టార్గెట్​ రూ. 1700- రూ. 1725

Tata Steel share price target : టాటా స్టీల్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్, స్టాప్​ లాస్​ రూ. 114, టార్గెట్​ రూ. 132

ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్, స్టాప్​ లాస్​ రూ. 52, టార్గెట్​ రూ. 70

ICICI Bank share price target : ఐసీఐసీఐ బ్యాంక్​:- బై రూ 871, స్టాప్​ లాస్​ రూ. 860, టార్గెట్​ రూ. 895

కోల్​ ఇండియా:- బై రూ. 227, స్టాప్​ లాస్​ రూ. 220, టార్గెట్​ రూ. 240

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel

సంబంధిత కథనం