Stocks to buy today : ట్రేడర్స్​ గైడ్​.. నేటి ‘స్టాక్స్​ టు బై’ లిస్ట్​ ఇదే!-day trading guide for today 6 stocks to buy 14th november ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Day Trading Guide For Today, 6 Stocks To Buy 14th November

Stocks to buy today : ట్రేడర్స్​ గైడ్​.. నేటి ‘స్టాక్స్​ టు బై’ లిస్ట్​ ఇదే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 14, 2022 07:10 AM IST

Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

ట్రేడర్స్​ గైడ్​.. నేటి ‘స్టాక్స్​ టు బై’ లిస్ట్​ ఇదే!
ట్రేడర్స్​ గైడ్​.. నేటి ‘స్టాక్స్​ టు బై’ లిస్ట్​ ఇదే! (MINT)

Stocks to buy today : సానుకూల అంతర్జాతీయ పవనాలు, బలమైన త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను భారీ లాభాల్లో ముగించాయి. నిఫ్టీ50.. 321 పాయింట్ల లాభంతో 18,350 వద్ద స్థిరపడింది. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 1,181 పాయింట్లు వృద్ధిచెంది 61,795 వద్ద ముగిసింది. బ్యాంక్​ నిఫ్టీ 2.13శాతం లాభాలతో 42,137 వద్దకు చేరింది.

ట్రెండింగ్ వార్తలు

గత వారంలో ఎఫ్​ఐఐలు నెట్​ బయర్స్​గా మారి.. దేశీయ స్టాక్​ మార్కెట్​లో రూ. 6,330.17కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,255.91కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

అమెరికాలో ద్రవ్యోల్బణం దిగొస్తుండటం.. ప్రపంచ స్టాక్​ మార్కెట్లకు అత్యంత సానుకూల విషయంగా మారింది. ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు తీవ్రత తగ్గుతుందన్న అంచనాలతో మదుపర్లు అమ్మకాల జోరు కొనసాగిస్తున్నారు. అదే సమయంలో డాలరుతో పోల్చితే రూపాయి విలువ బలపడటం కూడా మదుపర్ల సెంటిమెంట్​కు కలిసివచ్చింది.

Stock market news today : స్టాక్​ మార్కెట్​ నిపుణులు ప్రకారం.. ఇన్ని రోజులు రెసిస్టెంట్లుగా ఉన్న 18,150- 18,350 లెవెల్స్​ని నిఫ్టీ ఒక్క క్యాండిల్​తో దాటేసింది. ఇది నిఫ్టీలో బలాన్ని సూచిస్తోంది. ఫలితంగా నిఫ్టీ షార్ట్​ టర్మ్​ ట్రెండ్​.. అప్​ట్రెండ్​గానే ఉంది. అయితే.. 18,600 వద్ద రెసిస్టెన్స్​ ఉంది. 18,150 వద్ద సపోర్ట్​ ఉంది.

నిఫ్టీ, సెన్సెక్స్​లు ఆల్​ టైమ్​ హైని బ్రేక్​ చేస్తాయా? లేదా? అని మదుపర్లలో ఆసక్తి నెలకొంది. తాజా పరిణామాలను చూస్తుంటే.. ఈ వారంలో సూచీల ఆల్​ టైమ్​ హై బ్రేక్​ అవుతుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎస్​జీఎక్స్​ నిఫ్టీ..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాలతో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ.. 41 పాయింట్ల లాభంలో ఉండటమే ఇందుకు కారణం.

స్టాక్స్​ టు బై..

Stocks to buy : ఇన్ఫోసిస్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1540, టార్గెట్​ రూ. 1610-1630

రిలయన్స్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 2590, టార్గెట్​ రూ. 2680- 2700

ఐటీసీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 344, టార్గెట్​ రూ. 375

విప్రో:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాసర్​ రూ. 384, టార్గెట్​ రూ. 420

పీవీఆర్​:- బై రూ. 1145, స్టాప్​ లాస్​ రూ. 1115, టార్గెట్​ రూ. 1204

మనప్పురం ఫైనాన్స్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 104.70, టార్గెట్​ రూ. 117

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel

సంబంధిత కథనం