Stock market news today : భారీ లాభాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీ 250 పాయింట్లు జంప్-stock market news today 11 november 2022 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market News Today : భారీ లాభాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీ 250 పాయింట్లు జంప్

Stock market news today : భారీ లాభాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీ 250 పాయింట్లు జంప్

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 11, 2022 09:16 AM IST

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సైతం లాభాల్లోనే ట్రేడ్​ అవుతున్నాయి.

ఇండియా స్టాక్​ మార్కెట్​
ఇండియా స్టాక్​ మార్కెట్​ (MINT_PRINT)

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను భారీ లాభాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 839పాయింట్ల లాభంతో 61,452 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 252పాయింట్లు వృద్ధిచెంది 18,279 వద్ద ట్రేడ్​ అవుతోంది.

అమెరికా ద్రవ్యోల్బణం డేటా.. అంచనాల కన్నా తక్కువ రావడంతో అక్కడి స్టాక్​ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ఈ సానుకూల పవనాల మధ్య దేశీయ స్టాక్​ మార్కెట్లు కూడా లాభాల్లో ఉన్నాయి.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు నష్టాలను చూశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 402 పాయింట్ల నష్టంతో 60,614 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 129 పాయింట్లు కోల్పోయి.. 18,028 వద్ద ముగిసింది. ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 61,311- 18,272 వద్ద ప్రారంభించాయి.

పివొట్​ ఛార్ట్స్​ ప్రకారం.. నిఫ్టీ సపోర్టు 17,951- 17,900 లెవల్స్​ వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్​.. 18,085- 18,116 లెవల్స్​ వద్ద ఉంది.

స్టాక్స్​ టు బై..

  • విప్రో :- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​- రూ. 375, టార్గెట్​- రూ. 405,
  • ఎన్​టీపీసీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​- రూ. 164, టార్గెట్​- రూ. 190
  • కొటాక్​ మహీంద్ర బ్యాంక్​:- బై రూ. 1920, స్టాప్​ లాస్​ రూ. 1914, టార్గెట్​ రూ. 1932

పూర్తి లిస్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

లాభాలు.. నష్టాలు..

సెన్సెక్స్​ 30లో అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు..

US inflation data 2022 : ద్రవ్యోల్బణం తగ్గడంతో.. ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు తీవ్రత కూడా దిగొస్తుందని మదుపర్లు అంచనా వేశారు. ఫలితంగా అమెరికా స్టాక్​ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి.

యూఎస్​ సీపీఐ డేటా పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

అమెరికా మార్కెట్ల సానుకూలతతో ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లో ఉన్నాయి. జపాన్​ నిక్క 2శాతం బలపడింది. సౌత్​ కొరియా కాస్పి 3శాతం, ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200 2.65శాతం మేర లాభాల్లో ఉన్నాయి.

త్రైమాసిక ఫలితాలు..

హిందాల్కో, మహీంద్రా అండ్​ మహీంద్రా, ఎల్​ఐసీ, ఏబీబీ ఇండియా, అదానీ పవర్​, అలెంబిక్​ ఫార్మా, లెమన్​ ట్రీ హోటల్స్​, జీ ఎంటర్​టైన్​మెంట్​, ఉజ్జీవన్​ ఫైనాన్షియల్​ సర్వీసెస్​తో పాటు ఇతర సంస్థల ఫలితాలు నేడు విడుదలకానున్నాయి.

Zomato q2 results : జొమాటో క్యూ2 ఫలితాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

అరబిందో ఫార్మా, బ్రిగేడ్​ ఎంటర్​ప్రైజేస్​, గుడ్​ఫ్రే ఫిలిప్స్​ ఇండియా, హిందుస్థాన్​ కాపర్​, జేకే సిమెంట్​, లుమెక్స్​ ఆటో టెక్నాలజీస్​, మనప్పురం ఫైనాన్స్​, పరాస్​ డిఫెన్స్​ అండ్​ స్పేస్​ టెక్నాలజీస్​, పతంజలి ఫుడ్స్​తో పాటు ఇతర సంస్థల ఫలితాలు శనివారం విడుదలకానున్నాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 36.06కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 967.13కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

సంబంధిత కథనం