Smartphones under 20,000 : ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​- ధర రూ.20వేల లోపే..!-best smartphones to buy in india under 20 000 in november 2022 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Best Smartphones To Buy In India Under 20,000 In November 2022

Smartphones under 20,000 : ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​- ధర రూ.20వేల లోపే..!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 06, 2022 01:04 PM IST

Best smartphones under ₹20,000 in November : నవంబర్​ నెలలో రూ.20వేల లోపు లభిస్తున్న ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ లిస్ట్​ని మీ ముందుకు తీసుకొచ్చాము. మీరు ఓ లుక్కేయండి!

రూ. 20వేల లోపు ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే..
రూ. 20వేల లోపు ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే..

Best smartphones under 20,000 in November : మీ స్మార్ట్​ఫోన్​ పాడైపోయిందా? పండుగ సీజన్​ ఆఫర్స్​ కూడా అయిపోయాయి, ఇప్పుడు కొత్త ఫోన్​ కొనేదెలా అని ఆలోచిస్తున్నారా? టెన్షన్​ పడకండి. నవంబర్​లో రూ.20వేల లోపు అందుబాటులో ఉండనున్న ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ లిస్ట్​ని మీకోసం మేము సిద్ధం చేశాము. ఇందులో 5జీ స్మార్ట్​ఫోన్స్​ కూడా ఉన్నాయి. ఈ లిస్ట్​పై మీరు ఓ లుక్కేయండి..

రెడ్​మీ నోట్​ 11టీ 5జీ..

Redmi Note 11T 5G : ఇందులో మీడియాటెక్​ డైమెన్సిటీ 810 5జీ ఆక్టా-కోర్​ ప్రాసెసర్​ ఉంటుంది. 6.6ఇంచ్​ ఎఫ్​హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లే, 2400X1080 పిక్సెల్​ రిసొల్యూషన్​ దీని సొంతం. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ ఇందులో ఉంటుంది. ఆండ్రాయిడ్​ 11 ఓఎస్​తో ఇది ఆపరేట్​ చేస్తుంది.

వివో టీ1..

Vivo T1 price : వివో టీ1లో 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 680 ప్రాసెసర్​ దీని సొంతం. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, 6.44 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ ప్లస్​ అమోలెడ్​ స్క్రీన్​ ఇందులో ఉంటాయి. ఈ స్మార్ట్​ఫోన్​పై 1 ఇయర్​ వారెంటీ కూడా ఉంది. ఇక రేర్​లో.. ట్రిపుల్​ కెమెరా సెటప్​ ఉంది.

శాంసంగ్​ గ్యాలెక్సీ ఎఫ్​23 5జీ..

Samsung Galaxy F23 5G features : ఈ స్మార్ట్​ఫోన్​కు రేర్​లో ట్రిపుల్​ కెమెరా సెటప్​ ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీ, 2+2 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 750జీ ప్రాసెసర్​ ఇందులో ఉంటుంది. 5,000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. ఇక ఫ్రంట్​ కెమెరాకు 8ఎంపీ ఇస్తున్నారు.

ఐక్యూ జెడ్​5 5జీ..

iQoo Z5 5G : ఇందులో 44వాట్​ ఫ్లాష్​ఛార్జ్​ సెటప్​ ఉంటుంది. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 778 5జీ ప్రాసెసర్​, ఆండ్రాయిడ్​ 11 ఓఎస్​, ఫన్​టచ్​ఓఎస్​ 11 ఇందులో ఉంటాయి. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, 120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​ స్క్రీన్​ దీని సొంతం.

రియల్​మీ 9ఐ..

Realme 9i : క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 680 ఆక్టా-కోర్​ ప్రాసెసర్​ విత్​ 5,000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. ఇందులో 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6.6ఇంచ్​ ఫుల్​ హెచ్​డీప్లస్​ స్క్రీన్​ దీని సొంతం. రేర్​లో 50ఎంపీ మెయిన్​ కెమెరా ఇచ్చారు.

వన్​ప్లస్​ నార్డ్​ సీఈ2 లైట్​ 5జీ..

OnePlus Nord CE2 Lite 5G : ఇందులో ఆక్సీజెన్​ఓఎస్​ ఆధారిత ఆండ్రాయిడ్​ 12 ఓఎస్​ ఉంటుంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, 64ఎంపీ రేర్​ కెమెరా దీని సొంతం.

WhatsApp channel

సంబంధిత కథనం