Apple iPhone fold : ఐఫోన్​ ‘ఫోల్డ్’​పై యాపిల్​ కసరత్తు.. శాంసంగ్​కు ధీటుగా!-apple iphone fold may be launched in 2025 to compete with samsung oppo more details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Apple Iphone Fold May Be Launched In 2025, To Compete With Samsung Oppo More Details Here

Apple iPhone fold : ఐఫోన్​ ‘ఫోల్డ్’​పై యాపిల్​ కసరత్తు.. శాంసంగ్​కు ధీటుగా!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 31, 2022 08:32 AM IST

Apple iPhone fold : యాపిల్​ నుంచి ఫోల్డబుల్​ స్మార్ట్​ఫోన్​ రాబోతోందని తెలుస్తోంది. ఈ ఐఫోన్​ ఫోల్డ్​కు సంబంధించి.. ఇప్పటివరకు ఉన్న వివరాలు చూసేయండి..

ఐఫోన్​ ఫోల్డబుల్​ స్మార్ట్​ఫోన్​పై యాపిల్​ కసరత్తు..!
ఐఫోన్​ ఫోల్డబుల్​ స్మార్ట్​ఫోన్​పై యాపిల్​ కసరత్తు..! (Representative image)

Apple iPhone fold : శాంసంగ్​, ఒప్పో, మోటోరోలా, హువావే తర్వాత.. 'ఫోల్డబుల్​' స్మార్ట్​ఫోన్​ సెగ్మెంట్​లోకి ఎంట్రీ ఇచ్చేందుకు యాపిల్​ కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే.. 2025లో ఐఫోన్​ ఫోల్డబుల్​ స్మార్ట్​ఫోన్​ లాంచ్​ అయ్యే అవకాశం ఉంది.

యాపిల్​ ఐఫోన్​ ఫోల్డ్​.. !

ఫోల్టబుల్​ స్మార్ట్​ఫోన్​ సెగ్మెంట్​లో ప్రస్తుతం శాంసంగ్​దే హవా! గ్యాలెక్సీ జెడ్​ ఫోల్డ్​, జెడ్​ ఫ్లిప్​ సిరీస్​తో కస్టమర్లకు ఆకట్టుకుంది ఈ దిగ్గజ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ. ఒప్పో, మోటోరోలాకు చెందిన ఫోల్డబుల్​ స్మార్ట్​ఫోన్స్​కు కూడా మంచి డిమాండ్​ కనిపిస్తోంది.

Apple foldable smartphone : యాపిల్​ నుంచి ఓ ఫోల్డబుల్​ స్మార్ట్​ఫోన్​ వచ్చే అవకాశం ఉందని నివేదికలు సూచించాయి. ప్రస్తుతం ఉన్న లీక్స్​ ప్రకారం.. ఈ స్మార్ట్​ఫోన్​ పేరు 'ఐఫోన్​ ఫోల్డ్​'!. ఇందులో ఓఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది. యూఎస్​బీ- సీ పోర్ట్​ ఉండొచ్చు. మాగ్​సేఫ్​ ఫీచర్​ను ఈ ఐఫోన్​ ఫోల్డ్​ సపోర్ట్​ చేయవచ్చు. టచ్​ ఐడీతో పాటు ఫేస్​ ఐడీ ఆప్షన్​ కూడా ఉండే అవకాశం ఉంది. డిజైన్​ పరంగా.. యాపిల్​ ఐఫోన్​ ఫోల్డ్​.. శాంసంగ్​ గెలాక్సీ జెడ్​ ఫ్లిప్​ను పోలి ఉండే అవకాశం ఉందని.. ప్రముఖ టిప్​స్టర్​ జాన్​ ప్రోస్సెర్​ తెలిపాడు. వివిధ లీక్స్​ ప్రకారం.. ఈ ఐఫోన్​ ఫోల్డ్​లో క్లామ్​షెల్​ డిజైన్​ ఉండొచ్చని వివరించాడు.

"క్లామ్​షెల్​ ఫోల్డబుల్​ ఐఫోన్​లో ఫోల్డబుల్​ డిస్​ప్లే ఉంటుంది. ఇందులో శాంసంగ్​ సప్లై చేసే ఓఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుందని నాకు తెలిసింది. ఐఫోన్​ ఫోల్డ్​.. ఒకటే వర్షెన్​లో వస్తుందని సమాచారం," అని జాన్​ ప్రోస్సెర్​ వివరించాడు.

Apple foldable iPhone : ఐఫోన్​ ఫోల్డబుల్​ స్మార్ట్​ఫోన్​ కోసం యాపిల్​ తీవ్ర స్థాయిలోనే కసరత్తులు చేస్తున్నట్టు కనిపిస్తోంది. అల్ట్రా- థిన్​ కవర్​ గ్లాస్​ను తయారు చేసేందుకు.. ఎల్​జీతో యాపిల్​ కలిసి పనిచేస్తోందని సమాచారం. 20- ఇంచ్​ ఫోల్డబుల్​ డిస్​ప్లే సప్లై చేసే వారి కోసం యాపిల్​ చూస్తున్నట్టు వివిధ లీక్స్​ ద్వారా తెలిసింది. వీటన్నింటినీ చూస్తుంటే.. యాపిల్​ ఐఫోన్​ ఫోల్డ్​.. కస్టమర్లను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నట్టు స్పష్టమవుతోంది.

ఫోల్డెబుల్​ మాక్​బుక్​ కూడా వస్తుందని ఊహాగానాలు ఉన్నాయి. అయితే.. ఇది 2026-27 వరకు రాకపోవచ్చు. ఫలితంగా.. యాపిల్​ నుంచి ఐఫోన్​ ఫోల్డ్​ ముందు వస్తుంది.

Apple iPhone latest news : ఫోల్డబుల్​ స్మార్ట్​ఫోన్స్​కు డిమాండ్​ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐఫోన్​ ఫోల్డ్​ వార్తలు.. యాపిల్​ ప్రేమికులను ఊరిస్తున్నాయి. ఫలితంగా వీటిపై ఇప్పటికే మార్కెట్​లో అంచనాలు పెరిగిపోయాయి. ఈ యాపిల్​ ఐఫోన్​ ఫోల్డ్​పై రానున్న కాలంలో మరింత సమాచారం తెలుస్తుంది. మరి ఇది యాపిల్​ ప్రేమికుల అంచనాలను అందుకుంటుందా? లేదా? అన్న చూడాలి..

WhatsApp channel

సంబంధిత కథనం