Samsung Galaxy Z Fold 3 : గ్యాలెక్సీ జెడ్ ఫోల్డ్ 3పై అదిరిపోయే ఆఫర్స్..!
Samsung Galaxy Z Fold 3 : సాంసంగ్ గ్యాలెక్సీ జెడ్ ఫోల్డ్ 3పై ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్లు లభిస్తున్నాయి. ఫోల్డెబుల్ ఫోన్ కొనాలని చూస్తుంటే.. ఇదే మంచి అవకాశం! ఆ వివరాలు మీరూ చూసేయండి.
(1 / 5)
Samsung Galaxy Z Fold 3లో స్నాప్‌డ్రాగన్ 888 చిప్సెట్ ఉంది. ట్రిపుల్ కెమెరా సెటప్ దీని సొంతం. 12ఎంపీ వైడ్, 12ఎంపీ అల్ట్రావైడ్, 12ఎంపీ టెలిఫొటో లెన్స్ ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి.(Samsung)
(2 / 5)
Samsung Galaxy Z Fold 3 ధర రూ. 1,71,999. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల కారణంగా ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 1,49,900కే లభిస్తోంది. ఇది 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్.(Samsung)
(3 / 5)
దీనికి తోడు.. యాక్సిస్ బ్యాంక్ కార్డులపై 5శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తోంది. ఫలితంగా Samsung Galaxy Z Fold 3 మరింత చౌకగా వస్తోంది.(Bloomberg)
(4 / 5)
Samsung Galaxy Z Fold 3 కొనుగోలుకు ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ప్రతి నెల రూ. 51,138ను మూడు నెలల పాటు చెల్లించాలి. (Samsung)
(5 / 5)
ఇటీవలే Samsung Galaxy Z Fold 4 లాంచ్ అయ్యింది. లెటెస్ట్ టెక్నాలజీ కావాలి అనుకుంటే ఈ ఫోన్ కొనొచ్చు. లేదా.. Samsung Galaxy Z Fold 3ని కొనుగోలు చేయవచ్చు. దీనికి ఇటీవలే ఆండ్రాయిడ్ 13 అప్డేట్ కూడా వచ్చింది.(Samsung)
ఇతర గ్యాలరీలు