Amul milk price hike : అమూల్​ పాల ధరలు పెంపు.. నేటి నుంచే అమలు-amul milk price hike news rates get costlier from today check new prices here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Amul Milk Price Hike News Rates Get Costlier From Today: Check New Prices Here

Amul milk price hike : అమూల్​ పాల ధరలు పెంపు.. నేటి నుంచే అమలు

Sharath Chitturi HT Telugu
Feb 03, 2023 11:55 AM IST

Amul milk price hike : అమూల్​ పాల ధరలు మళ్లీ పెరిగాయి. తాజాగా పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.

Amul has increased price for milk.
Amul has increased price for milk.

Amul milk price hike : పాల ధరలను పెంచుతున్నట్టు అమూల్​ సంస్థ ప్రకటించింది. ధరల పెంపు నేటి నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. తాజా నిర్ణయంతో పాల ధరలు లీటరుకు గరిష్ఠంగా రూ. 3 పెరిగాయి.

"అమూల్​ పౌచ్​ మిల్క్​ (అన్ని రకాలు) ధరలను సవరించాము. 2023 ఫిబ్రవరి 3 ఉదయం నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయి," అని అమూల్​ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.

అమూల్​ పాల ధరలు- తాజా రేట్లు..

ప్రాడక్టురూపాయి
అమూల్​ తాజా 500ఎంఎల్​27
అమూల్​ తాజా 1 లీటరు54
అమూల్​ తాజా 2 లీటర్లు108
అమూల్​ తాజా 6 లీటర్లు524
అమూల్​ తాజా 180ఎంఎల్​10
అమూల్​ గోల్డ్​ 500ఎంఎల్​33
అమూల్​ గోల్డ్​ 1 లీటర్​66
అమూల్​ గోల్డ్​ 6 లీటర్లు396
అమూల్​ కౌ మిల్క్​ 500ఎంఎల్​28
అమూల్​ కౌ మిల్క్​ 1 లీటర్​56
అమూల్​ ఏ2 బఫెల్లో మిల్క్​ 500ఎంఎల్​35
అమూల్​ ఏ2 బఫెల్లో మిల్క్​ 1 లీటర్​70
అమూల్​ ఏ2 బఫెల్లో మిల్క్​ 6 లీటర్లు420

ఏడాదిగా.. బాదుడు..!

Amul milk price increase : పాల ధరలు దేశంలో గత 10 నెలల్లోనే రూ. 12 పెరిగాయి! అంతకుముందు ఏడేళ్ల వరకు పాల ధరల్లో ఒక్క రూపాయి కూడా మార్పు రాలేదు. 2013- 2014 మధ్యలో పాల ధరలు లీటరుకు రూ. 8 పెరిగాయి.

ఇక వేసవిలో పాల ఉత్పత్తి ప్రతియేటా తగ్గుతుంది. డిమాండ్​ అందుకోవాలంటే.. పాల సంస్థలు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకే.. రానున్న రోజుల్లో పాల ధరలు మళ్లీ పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి.

Amul milk price hike news latest : మరో పాల ఉత్పత్తి సంస్థ మథర్​ డెయిరీ కూడా ధరలను పెంచుతూ వస్తోంది. 2022 మార్చ్​ 5 నుంచి డిసెంబర్​ 27 మధ్యలో మథర్​ డెయిరీ పాల ధరలు లీటరుకు రూ. 57 నుంచి రూ.66కి చేరాయి. అంటే రూ. 6 పెరిగినట్టు.

WhatsApp channel