Tecno Pova 4 । లేటెస్ట్ టెక్నాలజీతో టెక్నో నుంచి లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌!-after launching pro version now tecno pova 4 also debuts ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  After Launching Pro Version, Now Tecno Pova 4 Also Debuts

Tecno Pova 4 । లేటెస్ట్ టెక్నాలజీతో టెక్నో నుంచి లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌!

HT Telugu Desk HT Telugu
Oct 12, 2022 04:29 PM IST

మార్కెట్లో కొత్తగా Tecno Pova 4 స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఇందులో వినియోగించిన ప్రాసెసర్ చాలా కొత్తది. ఈ ఫోన్ కు సంబంధించిన మరిన్ని ఫీచర్లు ఇక్కడ చూడండి.

Tecno Pova 4
Tecno Pova 4

చైనీస్ మొబైల్ కంపెనీ టెక్నో ఇటీవలే సరికొత్త టెక్నో పోవా 4 సిరీస్‌ను పరిచయం చేసింది. ఇందులో భాగంగా మిడ్-రేంజ్ ఆఫర్‌గా Tecno Pova 4 Pro స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఈ 'ప్రో' మోడల్ కంటే కాస్త తక్కువలో ప్రామాణిక Pova 4 వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. అయితే ప్రో మోడల్‌లో కనిపించే కొన్ని ఫీచర్లను ఇందులోనూ షేర్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Tecno Pova 4 అనేది 4G వెర్షన్ ఫోన్. అయితే ఇందులో మెరుగైన పనితీరును కనబరిచే సరికొత్త Helio G99 SoCని అమర్చారు. ఇదే తరహా చిప్‌సెట్ Redmi 11 Prime అలాగే Moto G72 లోనూ కనిపిస్తుంది. ఇదేకాకుండా బ్యాటరీ, స్టోరేజ్ కూడా టెక్నో పోవాలో మెరుగ్గానే ఉంది. భద్రత ఆప్షన్లలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, AI ఫేస్ అన్‌లాక్‌కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

ఈ Tecno Pova 4 ఏకైక ఏకైక స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ 8GB RAMతో అందుబాటులో ఉంటుంది. వర్చువల్ రూపంలో ర్యామ్ సామర్థ్యాన్ని మరో 5GB వరకు పెంచుకోవచ్చు. అలాగే ఈఫోన్ గ్రే, బ్లూ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్ల జాబితాలో ఇంకా ఏమేమి ఉన్నాయి, ధర ఎంత మొదలైన విషయాల కోసం ఈ కింద పరిశీలించండి.

Tecno Pova 4 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.82 అంగుళాల LCD FHD+ డిస్‌ప్లే
  • 8GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ Helio G99 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP+ 2MP కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 6000 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఛార్జర్

అదనంగా, డ్యూయల్ సిమ్ స్లాట్, 4G, డ్యూయల్-బ్యాండ్ WiFi, బ్లూటూత్, GNSS, NFC, USB టైప్-C, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-సి మొదలైనవి ఉన్నాయి.

ప్రస్తుతం Tecno Pova 4 బంగ్లాదేశ్ మార్కెట్లో అందుబాటిలోకి వచ్చింది. అక్కడ దీని ధర BDT 21,990 అంటే సుమారు రూ. 17,800/- . నేరుగా భారత మార్కెట్లో విడుదలయితే ఈ ఫోన్ ధర మరింత తగ్గిపోతుంది. ఈ దీపావళి నాటికి భారత్ మార్కెట్లోనూ ఈ ఫోన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే విడుదల తేదీని టెక్నో ఇంకా ఖరారు చేయలేదు.

WhatsApp channel

సంబంధిత కథనం