Accenture layoffs 2023 : భారీగా జాబ్​ కట్స్​కు సిద్ధమైన దిగ్గజ ఐటీ కంపెనీ!-accenture layoffs 2023 it firm to cut 19 000 jobs trims forecasts ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Accenture Layoffs 2023 It Firm To Cut 19,000 Jobs, Trims Forecasts

Accenture layoffs 2023 : భారీగా జాబ్​ కట్స్​కు సిద్ధమైన దిగ్గజ ఐటీ కంపెనీ!

Sharath Chitturi HT Telugu
Mar 23, 2023 05:45 PM IST

Accenture layoffs 2023 : దిగ్గజ ఐటీ సంస్థ యాక్సెంచర్​.. తమ సంస్థలోని 19వేలకుపైగా మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

భారీగా జాబ్​ కట్స్​కు సిద్ధమైన దిగ్గజ ఐటీ కంపెనీ!
భారీగా జాబ్​ కట్స్​కు సిద్ధమైన దిగ్గజ ఐటీ కంపెనీ! (Mint)

Accenture layoffs 2023 : తమ సంస్థలో పనిచేస్తున్న 19వేలకుపైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు.. దిగ్గజ ఐటీ కంపెనీ యాక్సెంచర్​ ప్రకటించింది. అంతేకాకుండా వార్షిక ఆదాయం, లాభాల అంచనాలను తగ్గిస్తున్నట్టు పేర్కొంది. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతోందన్న సంకేతాలను యాక్సెంచర్​ తాజా ప్రకటన మరింత బలపరిచింది.

ట్రెండింగ్ వార్తలు

ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ఏడాది కాలంగా ఐటీ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కంపెనీ లాభాలు పడిపోతుండటంతో.. సంస్థలు కాస్ట్​ కటింగ్​వైపు మొగ్గుచూపుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ జాబితాలోకి యాక్సెంచర్​ కూడా చేరింది. వార్షిక ఆదాయ వృద్ధి, లాభాల అంచనాలను తగ్గించేసింది. 

Accenture layoffs news : రెవెన్య గ్రోత్​ గతంలో 8-11శాతం మధ్యలో ఉంటుందని అంచనా వేసిన యాక్సెంచర్​.. ఇప్పుడు దానిని సవరించి.. 8శాతంగానే ఉంటుందని పేర్కొంది. ఈపీఎస్​ (అర్నింగ్​ పర్​ షేర్​) సైతం.. గతంలో చెప్పిన 11.20 డాలర్లు- 11.52డాలర్ల కన్నా.. 10.84డాలర్లు- 11.06డాలర్ల మధ్యలో ఉంటుందని తాజా అంచనాలను విడుదల చేసింది. ప్రస్తుత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 16.1 బిలియన్​ డాలర్లు- 16.7బిలియన్​ డాలర్ల మధ్యలో ఉంటుందని అంచనా వేసింది.

Accenture layoffs latest news : తాజాగా చేపడుతున్న లేఆఫ్స్​లో సగానిపైగా ఉద్యోగాలు.. నాన్​ బిల్లెబుల్​ కార్పొరేట్​ ఫంక్షన్స్​ (క్లైంట్​కు బిల్​ వేయలేని కార్యకలాపాలను పర్యవేక్షించే ఉద్యోగాలు)లోనే ఉంటుందని యాక్సెంచర్​ స్పష్టం చేసింది.

యాక్సెంచర్​ ఒక్కటే కాదు.. మరో దిగ్గజ కంపెనీ కాగ్నిసెంట్​ సైతం ఆర్థిక వృద్ధిని తగ్గించింది. గత నెలలో ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.

అమెజాన్​లో లేఆఫ్​ సీజన్​..!

Amazon layoffs 2023 : ఆమెజాన్​లో లేఆఫ్ సీజన్ కొనసాగుతోంది. తాజాగా రానున్న కొన్ని వారాల్లో ఆమెజాన్ వెబ్ సర్వీస్, హెచ్ఆర్, అడ్వర్టైజింగ్, లైవ్ స్ట్రీమింగ్ సర్వీస్ విభాగాల నుంచి సుమారు 9 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించారు. గత నెలలోనే ఆమెజాన్ సుమారు 18 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. వారిలో ఎక్కువమంది హెచ్ఆర్, రిక్రూటింగ్ టీమ్ ల వారే ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం