YS Viveka Murder Case : తెలంగాణకు వైఎస్‌.వివేకా హత్య కేసు బదిలీ-ys viveka murder case trail transferred to hyderabad cbi special court ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Viveka Murder Case : తెలంగాణకు వైఎస్‌.వివేకా హత్య కేసు బదిలీ

YS Viveka Murder Case : తెలంగాణకు వైఎస్‌.వివేకా హత్య కేసు బదిలీ

HT Telugu Desk HT Telugu
Nov 29, 2022 11:58 AM IST

YS Viveka Murder Case మాజీ మంత్రి వైఎస్‌.వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును తెలంగాణకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. వివేకా కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన కుమార్తె వైఎస్ సునీత తో పాటు సతీమణి వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వైఎస్ సునీత పిటిషన్‍పై అక్టోబర్‌ 19నాటికి విచారణ పూర్తైనా, తుది తీర్పును నేడు వెలురించారు. జస్టిస్ ఎంఆర్‍షా నేతృత్వంలోని ధర్మాసనం కేసుకు సంబంధించిన ఫైల్స్ అన్నీ కడప నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు తరలించాలని ఆదేశించింది.

వివేకా హత్య కేసు దర్యాప్తు హైదరాబాద్‌కు బదిలీ...
వివేకా హత్య కేసు దర్యాప్తు హైదరాబాద్‌కు బదిలీ... (Rahul Singh)

YS Viveka Murder Case 2019 మార్చిలో సొంతింటిలో హత్యకు గురైన వైఎస్‌.వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు ఆంధ్రప్రదేశ్‌ నుంచి మార్చాలని వివేకా కుమార్తె, సతీమణి చేసిన విజ్ఞప్తి సుప్రీం కోర్టు సానుకూలంగా తీర్పు వెలువరించింది. పిటిషననర్లు వెలువరించిన అభ్యంతరాలు సహేతుకంగా ఉన్నాయని అభిప్రాయ పడిన ధర్మాసనం కేసు దర్యాప్తు ఫైల్స్‌ను వీలైనంత త్వరగా జిల్లా కోర్టు నుంచి హైదరాబాద్‌లోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించారు.

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ చేస్తూ జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్ నాగరత్నలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ కేసు దర్యాప్తు ఏపీలో జరిగితే న్యాయం జరగదని వివేకా కుమార్తె, సతీమణి వ్యక్తం చేసిన ఆందోళన సరైనదనే భావిస్తున్నామని, అందుకే హైదరాబాద్ సీబీఐ కోర్టుకు మారుస్తున్నామని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.

పూర్తి స్థాయిలో విచారణ జరిపిన సుప్రీం కోర్టు ధర్మాసనం కేసు దర్యాప్తును హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఏపీలో జరుగుతున్న విచారణపై మరణించిన వ్యక్తి కుమార్తె, భార్య అసంతృప్తిగా ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని కేసును కడప న్యాయస్థానం నుంచి హైదరాబాద్‌ బదిలీ చేస్తున్నట్లు జస్టిస్‌ ఎం.ఆర్‌.షా పేర్కొన్నారు.

ఈ కేసులో సాక్షులను, నిందితులు బెదిరిస్తున్నారని, కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం నేడు తీర్పు వెల్లడించింది అక్టోబర్‌ 19వ తేదీన కేసు విచారణ ముగిసినా ఆరు వారాల తర్వాత సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలురించింది.

వైఎస్‌ వివేకా సతీమణి, కుమార్తె వ్యక్తం చేసిన అనుమానాలు సహేతుకమైనవేనని సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. కేసు దర్యాప్తులో బాధితులకు న్యాయం చేయడమే కాదు చేసినట్లు కనిపించాల్సిన అవసరముందని సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించే సమయంలో అభిప్రాయపడింది.ఈ కేసులో నిష్పాక్షిక విచారణ జరగడం లేదని వివేకా కుమార్తె సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. బాధితుల ఆందోళనను ధర్మాసనం పూర్తిగా అర్థం చేసుకున్నామని విచారణ పక్క రాష్ట్రానికి మారిస్తే బాధితులకు న్యాయం జరుగుతుందనే వాదనల్ని అంగీకరిస్తున్నట్లు చెప్పారు. బాధితులకు న్యాయం చేసే ప్రయత్నాల కంటే న్యాయం జరుగుతున్నట్లు కూడా కనిపించాలని, సాక్షులకు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

వైఎస్ వివేకా హత్య కేసు లోతైన దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. మరోవైపు వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డికి మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని దాకలైన పిటిషన్‌పై డిసెంబర్ 2వ తేదీన తీర్పు వెలువడను

IPL_Entry_Point

టాపిక్