Coconut trees at beach: విశాఖ బీచ్‌లో 200 కొబ్బరి చెట్లు నాటనున్న జీవీఎంసీ-visakhapatnam civic body plants 200 coconut trees at sagarnagar beach ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Visakhapatnam Civic Body Plants 200 Coconut Trees At Sagarnagar Beach

Coconut trees at beach: విశాఖ బీచ్‌లో 200 కొబ్బరి చెట్లు నాటనున్న జీవీఎంసీ

HT Telugu Desk HT Telugu
Feb 28, 2023 09:13 AM IST

Coconut trees at beach: పర్యాటకులను ఆకట్టుకునేలా విశాఖ బీచ్‌లో 200 కొబ్బరి చెట్లు నాటేందుకు జీవీఎంసీ ప్లాన్ చేస్తోంది.

ఇటీవల విశాఖ బీచ్‌లో నేవీ చేపట్టిన క్లీన్ కోస్టల్ డ్రైవ్
ఇటీవల విశాఖ బీచ్‌లో నేవీ చేపట్టిన క్లీన్ కోస్టల్ డ్రైవ్ (ANI pic service)

విశాఖపట్నం: పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి) సాగర్‌నగర్ బీచ్‌ ప్రాంతంలో 15 ఏళ్ల వయస్సు గల 200 కొబ్బరి చెట్లను నాటుతోంది.

‘సన్‌రే రిసార్ట్స్, జీవీఎంసీ సమిష్టి కృషితో చేపట్టిన ఈ చర్య వేసవిలో బీచ్‌ని సందర్శించే పర్యాటకులకు నీడను అందించడంతోపాటు అందంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుంది. జీవీఎంసీ ప్లాంటేషన్ డ్రైవ్ తర్వాత ఇసుకలో నాటిన మొక్కలు మంచి పరిమాణంలో పెరిగాయి. ఇది నిజంగా బీచ్‌లో పర్యాటకులను ఆకర్షిస్తుంది’ అని జీవీఎంసీ కమిషనర్ పి.రాజాబాబు చెప్పారు.

15 ఏళ్ల చెట్లను సక్రమంగా సంరక్షించాలి. సాధారణంగా మంచి పరిమాణంలో పెరిగిన చెట్లు కూల్చిన వెంటనే చనిపోతాయి. ప్రత్యేక సాంకేతికతతో కార్మికులు చెట్లను ఇసుకలో సురక్షితంగా నాటిన తర్వాత ఇంకా పెరిగేలా చూసుకుంటున్నారు..’ అని జీవీఎంసీ కమిషనర్ తెలిపారు.

‘సౌందర్యంగా కనిపించడమే కాకుండా కొబ్బరి చెట్లు మార్నింగ్ వాక్ కోసం ఇక్కడికి వచ్చేవారికి, పగటిపూట బీచ్‌ని సందర్శించే పర్యాటకులకు కూడా నీడను అందిస్తాయి’ అని ఆయన చెప్పారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం