MEIL e-Buses at Tirumala: త్వరలోనే TTD చేతికి ఉచితంగా 10 ఎలక్ట్రిక్ బస్సులు.. వీటి ప్రత్యేకతలివే -ttd to gets 10 olectra buses from meil company for use in tirumala
Telugu News  /  Photo Gallery  /  Ttd To Gets 10 Olectra Buses From Meil Company For Use In Tirumala

MEIL e-Buses at Tirumala: త్వరలోనే TTD చేతికి ఉచితంగా 10 ఎలక్ట్రిక్ బస్సులు.. వీటి ప్రత్యేకతలివే

02 March 2023, 20:51 IST HT Telugu Desk
02 March 2023, 20:51 , IST

  • TTD to gets 10 Olectra Buses From MEIL: తిరుమల శ్రీవారికి ఎంఈఐఎల్ (మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్) అందించే ఉచిత ఎలక్ట్రిక్ బస్సుల నమూనా సిద్ధమైంది. త్వరలోనే 10 ఎలక్ట్రిక్ బస్సులు టీటీడీకి అందనున్నాయి. ఆ తర్వాత తిరుమల కొండపై ఒలెక్ట్రా ఈ-బస్సులు సేవలు అందిచనున్నాయి.

ఎంఈఐఎల్  గ్రూప్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్​ లిమిటెడ్ ఈ బస్సులను హైదరాబాద్ సమీపంలోని తన ప్లాంట్ లో తయారు  చేస్తోంది.  టీటీడీ  మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన తొలి  బస్సును  గురువారం దేవస్థానముల రవాణా విభాగం జనరల్ మేనేజర్ పివీ  శేషారెడ్డి  సమగ్రంగా పరిశీలించారు. 

(1 / 6)

ఒలెక్ట్రా తయారు చేసిన  అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 10 ఎలక్ట్రిక్ బస్సులను తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)కు  అందించాలని ఎంఈఐఎల్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ బస్సులను తిరుమలను సందర్శించే భక్తులకు కాలుష్య రహిత ప్రయాణం అందించేందుకు  టీటీడీ వినియోగించనుంది.  టీటీడీ అధికారులకు  బస్సు పనితీరును ఒలెక్ట్రా ప్రతినిధులు  వివరించారు. ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పించేలా బస్సును తయారు చేశామని తెలిపారు. బస్సుల్లో ఎలెక్ట్రానిక్ డిస్ప్లే బోర్డ్ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయా ణిస్తోందో తెలిపే వివరాలు పొందుపరిచారు.  

(2 / 6)

భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమలలో  తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది, తిరుమల  పవిత్రత, ప్రాశస్త్యాన్ని తెలిపే ఫోటోలను బస్సుపై పొందు పరిచారు. బస్సులో  కొద్దిదూరం ప్రయాణించిన శేషారెడ్డి... పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. దేవస్థానం పాలకవర్గం, ఉన్నతాధికారులకు బస్సు  పని తీరును వివరిస్తామని తెలిపారు. ఎంఈఐఎల్   విద్యుత్ బస్సులను అందించటం సంతోషంగా ఉందని, వీటి వల్ల  తిరుమల కొండపై  కాలుష్య నియంత్రణ జరుగుతుందని అభిప్రాయపడ్డారు.  

(3 / 6)

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కేవీ.ప్రదీప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ "ఎంఈఐఎల్  భగవంతుని సేవలో   ఎప్పుడూ ముందుంటుంది. సంస్థ ప్రయాణంలో వేంకటేశ్వర స్వామి ఇచ్చిన ఆశీర్వాదాలకు ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుకోగలుగుతున్నాము. సంస్థ పురోగతి, భవిష్యత్తు ప్రయత్నాలలో స్వామివారి ఆశీస్సులు తమపై ఉండాలని కోరుకుంటున్నాము. 9 మీటర్ల పొడువున్న 10 ఎలక్ట్రిక్ బస్సులను తిరుమల తిరుపతి దేవస్థానానికి త్వరలో అందించనున్నాము.   ఈ-బస్సుల కోసం ఛార్జీంగ్​ పాయింట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాము" అని తెలిపారు. 

(4 / 6)

శ్రీవారి దర్శనం కోసం వచ్చే  భక్తులకు పరిశుభ్రమైన, వాయు, శబ్ధ కాలుష్యంలేని ప్రయాణాన్నిఈ విద్యుత్ బస్సుల ద్వారా  అందిస్తామని ప్రదీప్ తెలిపారు. ఒలెక్ట్రా అందిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు తిరుమలను పర్యావరణ హితంగా మార్చుతాయన్న  ఆశాభావాన్ని ఆయన  వ్యక్తం చేశారు.  ప్రస్తుతం తిరుమలలో 12 డీజిల్ బస్సులు భక్తులకు సేవలు అందిస్తున్నాయి.  త్వరలో ఒలెక్ట్రా  ఎలక్ట్రిక్ బస్సుల సేవలు ప్రారంభం అయితే టీటీడీకి డీజిల్ ఖర్చుల భారం తగ్గటంతో పాటు  పర్యావరణం మెరుగుపడేందుకు ఎంతో అవకాశం కలుగుతుంది. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో  50  ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు ప్రతిరోజూ  తిరుపతి , తిరుమల మధ్య నడుస్తూ భక్తులకు సేవలందిస్తున్న విషయం తెలిసిందే.

(5 / 6)

ప్రస్తుతం తిరుమలలో 12 డీజిల్ బస్సులు భక్తులకు సేవలు అందిస్తున్నాయి.  త్వరలో ఒలెక్ట్రా  ఎలక్ట్రిక్ బస్సుల సేవలు ప్రారంభం అయితే టీటీడీకి డీజిల్ ఖర్చుల భారం తగ్గటంతో పాటు  పర్యావరణం మెరుగుపడేందుకు ఎంతో అవకాశం కలుగుతుంది. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో  50  ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు ప్రతిరోజూ  తిరుపతి , తిరుమల మధ్య నడుస్తూ భక్తులకు సేవలందిస్తున్న విషయం తెలిసిందే.

(6 / 6)

ఇతర గ్యాలరీలు