Skill Development Scam : ఆ స్కాం కట్టుకథే… స్కిల్‌డెవలప్‌మెంట్‌పై టీడీపీ ఫైర్-telugu desam party denies allegations on skill development scam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Skill Development Scam : ఆ స్కాం కట్టుకథే… స్కిల్‌డెవలప్‌మెంట్‌పై టీడీపీ ఫైర్

Skill Development Scam : ఆ స్కాం కట్టుకథే… స్కిల్‌డెవలప్‌మెంట్‌పై టీడీపీ ఫైర్

HT Telugu Desk HT Telugu
Dec 06, 2022 01:52 PM IST

Skill Development Scam ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల్లో జరిగిందంటున్న రూ.241కోట్ల అవినీతి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సృష్టేనని టీడీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో 64 వేల మందికి ఉద్యోగాలు కల్పించిన స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలపై జగన్ కన్నుపడటం రాష్ట్ర యువత దురదృష్టం అని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏడాది కాలంగా స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల్లో లేని అవినీతిపై విచారణ జరిపిన సిఐడీ నేటికీ ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేకపోయిందని విమర్శిస్తున్నారు.

చంద్రబాబు, జగన్(ఫైల్ ఫొటో)
చంద్రబాబు, జగన్(ఫైల్ ఫొటో)

Skill Development Scam ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం వ్యవహారంపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ‍యన తనయుడు లోకేష్‌ల పాత్ర ఉంటుందనే ఆరోపణలపై టీడీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఆగస్ట్ 2021లో అంతా సక్రమంగా ఉందని కాలేజీ యాజమాన్యాలు లేఖలు రాస్తే సీఐడీ డిసెంబర్,2021 లో కేసు ఎలానమోదుచేసిందని ప్రశ్నిస్తున్నారు.

కొన్నిలక్షలమంది విద్యార్థుల జీవితాల్ని బాగుచేసిన ప్రాజెక్ట్ పై కడుపుమంట దేనికని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 2 లక్షల పైచిలుకు యువతకు నైపుణ్య శిక్షణ అందించి 64 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల పనితీరుని చూసి, సంతోషంగా ఉంటున్న యువతను చూసి ఓర్వలేక, సిఎం జేబు సంస్థ సీఐడీని విచారణ పేరుతో ఉసిగొల్పారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్ లు రూ.241కోట్ల అవినీతి చేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

“యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పారని వాటిలో భాగంగా 6 సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాలు, 34 టెక్నికల్ స్కిల్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూట్ కేంద్రాలను రాష్ట్రంలోని ప్రముఖ విద్యాలయాల్లో ఏర్పాటు చేశారని విద్యాభ్యాసం చేస్తున్న యువతలోని నైపుణ్యాలను వెలికితీసి, వారికి నచ్చిన రంగాల్లో మెరికల్లా చేయడానికే కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో టీడీపీ ప్రభుత్వహాయాంలో స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.

సిమెన్స్ కంపెనీ మొత్తం ప్రాజెక్ట్ ఖర్చులో 90శాతం వ్యయం భరించడానికి ముందుకొస్తే, మిగిలిన 10శాతం రాష్ట్రప్రభుత్వం భరించేలా ఒప్పందం చేసుకున్నారని జూన్, 2015 న చేసుకున్న ఒప్పందంలోనే రాష్ట్రంలో నెలకొల్పదలచిన 40 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలలో ఏర్పాటు చేయాల్సిన పరికరాలు, ఇతర సామాగ్రి వివరాలు పొందుపరిచారని, అన్నికేంద్రాల్లో యువత నైపుణ్యాభివృద్ధికి అవసరమైన సాఫ్ట్ వేర్, ఇతర పరికరాల ఏర్పాటు ఒప్పందంలో ముందే పేర్కొన్నారని, ప్రాజెక్టును కేవలం కాగితాలనే పరిమితం చేయకుండా 40 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చామని టీడీపీ నేతలు చెబుతున్నారు.

మార్చి31, 2020 నాటికే ఈ స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల్లో 2,11,984 మంది నైపుణ్య శిక్షణను పూర్తిచేసుకుంటే, వారిలో 64వేల మందికి ఉద్యోగాలుకూడా వచ్చాయంటున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు ఏర్పాటుచేశాక, వాటిని గాలికి వదిలేయకుండా నాటి టీడీపీప్రభుత్వం 64వేలమందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించిందని స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల శిక్షణా కార్యక్రమం కోవిడ్ సమయంలోకూడా నిర్విరామంగా కొనసాగిందన్నారు. దాదాపు 18వేల మందికి పైగా ఆన్ లైన్ లో శిక్షణను అందించారని టీడీపీ చెబుతోంది.

సీమెన్స్ సంస్థ ఎటువంటి పరికరాలు అందించిందో కడప ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ స్టాక్ రిజిస్టర్ చూస్తే తెలుస్తుందని, సిమెన్స్ సంస్థ గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 40 నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన వ్యయంలో 90 శాతం సిమెన్స్ భరించాలి. కేవలం 10 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దాని ప్రకారం సిమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు ఈ కేంద్రాలకు సంబంధించిన అన్ని రకాల సాప్ట్ వేర్ మరియు అధునాతన పరికరాలను తాము పెట్టాల్సిన 90 శాతం పెట్టుబడికి గాను అందించాయని చెబుతున్నారు. ఇదే విషయాన్ని 40 కాలేజీలు, విశ్వవిద్యాలయాల యాజమాన్యాలు లిఖితపూర్వకంగా దృవీకరించాయని చెబుతున్నారు.

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వారు, 05-12-2015న రాసిన లేఖ ఆధారంగా వాల్యూయేషన్ చేసినట్టు, మొత్తం వ్యాల్యూయేషన్ కరెక్టేనని సీఐడీటీ తననివేదికలో చెప్పింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ కాస్ట్ కి సంబంధించి, ఒక్కో క్లస్టర్ కు రూ.559కోట్ల ప్రతిపాదన ఏదైతే ఉందో, ఆ వ్యాల్యూయేషన్ మొత్తం నూటికినూరుశాతం కరెక్ట్ అని టీడీపీ నేతలు చెబుతున్నారు.

సీఐడీటీ వ్యాల్యూయేషన్ చేశాక ఇచ్చిన రిపోర్ట్ లో..... సాఫ్ట్ వేర్ కు సంబంధించి రూ.247.78కోట్లు, డిజిటల్ కోర్స్ లకు రూ.249.75కోట్లు, హార్డ్ వేర్ కు సంబంధించి రూ.48.48కోట్లు, సర్వీసెస్ కు సంబంధించి రూ.13.31 కోట్లు వ్యయంగా అంచనా వేశారని టీడీపీ చెబుతోంది. మొత్తంగా ఒక్కో క్లస్టర్ కు రూ.559.33 కోట్లు వ్యయం అవుతుందని మొత్తం 6 క్లస్టర్ల ప్రాజెక్టుకు (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, 34 టి.ఎస్.డీ.ఐ లు) రూ.3300 కోట్లకు పైబడి వ్యాల్యువేషన్ ఉంటుందని సిఐటీడి వారు చెప్పారని గుర్తు చేస్తున్నారు.

IPL_Entry_Point

టాపిక్