Rayalaseema | రాయలసీమకు వచ్చిన సముద్రం.. నమ్మట్లేదా? ఇదిగో ప్రూఫ్-sullurupeta and gudur sea beaches now added to tirupati district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Sullurupeta And Gudur Sea Beaches Now Added To Tirupati District

Rayalaseema | రాయలసీమకు వచ్చిన సముద్రం.. నమ్మట్లేదా? ఇదిగో ప్రూఫ్

HT Telugu Desk HT Telugu
Apr 04, 2022 01:15 PM IST

రాయలసీమకు సముద్రం లేదనే బాధ తీరిపోయింది. జిల్లాల విభజనతో రాయలసీమకు సముద్రం వచ్చినట్టైంది. అలా ఎలా అనుకుంటున్నారా? పూర్తిగా చదివితే మీకే తెలుస్తుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

పరిపాలన సౌలభ్యం కోసం.. ఏపీలో 26 జిల్లాలను పెంచారు. అయితే జిల్లాల ఏర్పాటు సందర్భంగా.. కొన్ని ఆసక్తికర విషయాలు చోటుచేసుకున్నాయి. కొత్తగా వ్యక్తుల పేర్లను కూడా జిల్లాలకు పెట్టారు. దీంతో.. మెుత్తం రాష్ట్రంలో 7 జిల్లాలకు వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. రాయలసీమకు సముద్రం రావడం... అలా ఎలా సాధ్యం అనుకోకండి. అది నిజమే కానీ అందులో ఓ లాజిక్ ఉంది.

ఇప్పటి వరకూ తొమ్మిది కోస్తా జిల్లాలకు తీర ప్రాంతం పరిమితమై ఉంది. శ్రీకాకుళం నుంచి.. నెల్లూరు వరకూ ఉంటుంది. అయితే ఇప్పుడు తీరప్రాంత ఉన్న జిల్లా లిస్టులోకి రాయలసీమలోని ఓ జిల్లా కూడా వెళ్లింది. ఎలా అంటే.. రాయలసీమలోని నాలుగు జిల్లాలను ఎనిమిది జిల్లాలు చేశారు. ఇందులోని తిరుపతి జిల్లాకు.. నెల్లూరు జిల్లాలో తీరప్రాంతం ఉన్న సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం కలిసింది. గూడూరు సైతం.. తిరుపతి జిల్లాలో కనిపిస్తుంది. దీనికి సైతం.. తీరం ఉంది.

తిరుపతి జిల్లా పూర్తిగా అటు రాయలసీమ ప్రాంతం కాదు. ఇటు కోస్తా ప్రాంతం సైతం కాదు. నెల్లూరు జిల్లాను పూర్తిగా కోస్తా ప్రాంతంగా ఉంటుంది. ఇప్పుడు కొంత ప్రాంతం తిరుపతి జిల్లాలోకి వెళ్లిందన్నమాట. ఇలా చూసుకుంటే.. రాయలసీమ జిల్లాలో కలిసినట్టు పరిగణించాలి. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, గూడురు నియోజకవర్గాల్లో బీచ్‌లు ఉంటాయి. ఇప్పుడు ఆ బీచ్ లు తిరుపతి జిల్లాలోకి వెళ్లాయి. ఇక రాయలసీమకు సముద్రం వచ్చినట్టైంది.

 

IPL_Entry_Point