Fits To Bus Driver : 15ఏళ్ళకు కలిగిన సంతానం….విధి వైపరీత్యంతో దుర్మరణం….-rtc bus lost control causes to young boy death in vizianagaram ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Rtc Bus Lost Control Causes To Young Boy Death In Vizianagaram

Fits To Bus Driver : 15ఏళ్ళకు కలిగిన సంతానం….విధి వైపరీత్యంతో దుర్మరణం….

HT Telugu Desk HT Telugu
Nov 21, 2022 09:46 AM IST

Fits To Bus Driver బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు ఒక్కసారిగా ఫిట్స్‌ రావడంతో పల్లెవెలుగు బస్సు అదుపు తప్పింది. వేగంగా దూసుకెళ్లి ఓ ఇంటి గోడను ఢీ కొట్టింది. గోడ పక్కనే ఆడుకుంటున్న బాలుడిని బస్సు ఢీకొట్టడంతో స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయాడు.

శృంగవరపు కోటలో ప్రమాదానికి గురైన ఆర్టీసి బస్సు
శృంగవరపు కోటలో ప్రమాదానికి గురైన ఆర్టీసి బస్సు

Fits To Bus Driver ఆ తల్లిదండ్రులకు పెళ్ళైన పదిహేనేళ్ల తర్వాత కొడుకు పుట్టడంతో అల్లరు ముద్దుగా పెంచుకున్నారు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి పైకి ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. డ్రైవర్‌కు ఫిట్స్‌ రావడంతో అదుపు తప్పిన బస్సు ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

విజయనగరం జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు నడుపుతున్న సమయంలో డ్రైవర్‌కు మూర్ఛ రావడంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. శృంగవరపు కోట డిపోకు చెందిన బస్సు ఆదివారం విజయనగరం బయల్దేరింది. మారుతీనగర్‌ ప్రాంతానికి వచ్చేసరికి డ్రైవర్‌ ఆర్‌.గంగునాయుడుకు ఫిట్స్ రావడంతో బస్సు అదుపు తప్పింది. దీంతో బస్సు ఓ ఇంటి ప్రహరీ గోడను ఢీకొట్టి నిలిచిపోయింది. ఇంటి ముందు ఆడుకుంటున్ శిరికి అభిషేక్ అనే బాలుడ్ని బస్సు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని శృంగవరపు కోట ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఏడో తరగతి విద్యార్థి సిరికి అభిషేక్‌ మృతి చెందాడు. బాలుడిని ఢీకొట్టిన తర్వాత రోడ్డు పక్కనున్న ఇంట్లోకి బస్సు దూసుకెళ్లింది. ఇంటి గోడ కూలి ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఫిట్స్‌ రావడంతో అపస్మారక స్థితికి చేరుకున్న డ్రైవర్‌ను 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించడంతో కోలుకున్నాడు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ నాయుడుకు గతంలో కూడా బస్సు నడుపుతుండగా ఫిట్స్‌ వచ్చినట్లు సహోద్యోగులు చెబుతున్నారు. పెళ్లైన చాలా కాలం తర్వాత పుట్టిన కొడుకు అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. బాలుడి తల్లిదండ్రులు ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. లేకలేక కలిగిన కొడుకును ప్రమాదం బలి తీసుకోవడంతో తల్లి మాధవి గుండెలవిసెలా రోదించింది. ఆర్టీసి ఉన్నతాధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

IPL_Entry_Point