IMD Weather Alert : వెదర్ అలర్ట్.. ఏపీకి భారీ వర్ష సూచన
Andhra Pradesh Weather News : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడే అవకాశముందని.. వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
ఆగ్నేయ బంగాళాఖాతం(Bay Of Bengal)లో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. వాతావరణ శాఖ(Weather Department) హెచ్చరించింది. తుపాను కారణంగా తమిళనాడు(Tamil Nadu), దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
గురవారం ఉదయం నాటికి నైరుతి బంగాళాఖాతంలో సమీపంలోని ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు తుపాను చేరనుందని వాతావరణ శాఖ చెప్పింది. ఈ కారణంగా గురువారం నుంచి మూడు రోజులపాటు దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు(Nellore), తిరుపతి, రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
తీరం వెంబడి 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే ప్రభావిత జిల్లా అధికారులు సూచనలు చేశారు. రాయలసీమ(Rayalaseema) జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా అధికారులు రెడ్ అలర్ట్(Red Alert) జారీ చేశారు. గురువారం నుంచి జిల్లాలో విస్తరంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. దీంతో జిల్లాలో ఇప్పటికే.. అధికారులు అప్రమత్తమయ్యారు.
తీవ్ర వాయుగుండం.. తూర్పు ఆగ్నేయంగా చెన్నైకి సమీపంలో కేంద్రీకృతమై ఉంది. దీంతో ఏపీలో వర్షాలు దంచికొట్టనున్నాయి. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ.. తుపానుగా మారే అవకాశం ఉంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) తీరాలను డిసెంబర్ 8 ఉదయం వరకు చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 8వ తేదీ నుంచి మూడు రోజులపాటు వానలు పడనున్నాయి.
ఉత్తరకోస్తాలో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉంది. శుక్రవారం తేలికపాటి నుచి మోస్తరు వానలు(Rains) పడతాయి. దక్షిణ కోస్తాలో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు(Heavy Rains) కురవనున్నాయి. ఈదురు గాలులు గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో వీస్తాయి. శుక్రవారం కూడా వర్షాలు పడనున్నాయి. రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈదురు గాలులు బలంగా వీయనున్నాయి.
సంబంధిత కథనం