Bharat Jodo Yatra In Pics : అమరావతి రైతులకు రాహుల్ గాంధీ మద్దతు-rahul gandhi bharat jodo yatra in andhra pradesh pics ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Rahul Gandhi Bharat Jodo Yatra In Andhra Pradesh Pics

Bharat Jodo Yatra In Pics : అమరావతి రైతులకు రాహుల్ గాంధీ మద్దతు

Oct 18, 2022, 10:41 PM IST HT Telugu Desk
Oct 18, 2022, 10:41 PM , IST

  • రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏపీలో కొనసాగుతోంది. కర్నూలు జిల్లా హాలహర్వి నుంచి మెుదలైంది. మధ్యాహ్నానికి ఆలూరు సరిహద్దుకు రాగా పార్టీ నేతలు ఘనస్వాగతం చెప్పారు. రాహుల్ గాంధీని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఏపీలో నాలుగురోజులపాటు జోడో యాత్ర సాగుతుంది.

రాహుల్ జోడో యాత్రంలో అమరావతి రైతులు కలిశారు. ఆంధ్రప్రదేశ్‍కు అమరావతే ఏకైక రాజధాని అని రైతులు అన్నారు. వీలైతే అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొంటానని రాహుల్ హామీ ఇచ్చారు. అమరావతి రైతుల పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నాన్నారు. అమరావతి రైతుల పోరాటానికి న్యాయ సహాయం అందిస్తామన్నారు.

(1 / 8)

ఈ రోజు ఇక్కడికి వచ్చి జోడో యాత్రలో కలిసినవారికి రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వీధుల్లో తిరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. చాలా మంది వ్యక్తులను కలిశానని చెప్పారు.

(2 / 8)

రైతులు, కూలీలు, సోదరీమణులు, తల్లులను కలిశానని రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. యాత్రకు వస్తున్న స్పందన పట్ల చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు.

(3 / 8)

బీజేపీ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న విద్వేషపూరిత, విభజన భావజాలంపై పోరాడేందుకు యాత్ర చేస్తున్నామని రాహుల్ అన్నారు. దేశాన్ని విడగొడుతున్నారని అన్నారు. దేశంలో ద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

(4 / 8)

దేశాన్ని విభజిస్తూ విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. 45 ఏళ్లలో లేని నిరుద్యోగిత రేటు భారత్‌లో ప్రస్తుతం ఉందన్నారు. నిత్యవసరాల ధరలు పెరుగుతూనే ఉన్నాయన్నారు.

(5 / 8)

చాలామంది రైతులను కలిశానని రాహుల్ గాంధీ అన్నారు. ఉల్లిని పండిస్తున్న రైతులతో మాట్లాడనని చెప్పారు. తమ పంటకు సరైన ధర లభించడం లేదని రైతులు అంటున్నారని రాహుల్ పేర్కొన్నారు.

(6 / 8)

పోలవరం ప్రాజెక్టు సమస్యలను నిర్వాసితులు వివరించారని రాహుల్ చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

(7 / 8)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు