CRDA plots : వాయిదాల్లో సిఆర్‌డిఏ ఫ్లాట్ల విక్రయం…-public can buy crda plots in instalments ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Crda Plots : వాయిదాల్లో సిఆర్‌డిఏ ఫ్లాట్ల విక్రయం…

CRDA plots : వాయిదాల్లో సిఆర్‌డిఏ ఫ్లాట్ల విక్రయం…

B.S.Chandra HT Telugu
Sep 18, 2022 11:19 AM IST

CRDA plots విక్రయాలకు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో వాయిదాల్లో వాటిని విక్రయించేందుకు సిఆర్‌డిఏ ఏర్పాట్లు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో వివిధ ప్రాంతాల్లో ఉన్న కమర్షియల్, రెసిడెన్షియల్ ఫ్లాట్లను వాయిదా పద్ధతిలో కొనుగోలు చేసేందుకు సిఆర్‌డిఏ ఏర్పాట్లు చేస్తోంది.

వాయిదాల్లో సిఆర్‌డిఏ ఫ్లాట్ల విక్రయం
వాయిదాల్లో సిఆర్‌డిఏ ఫ్లాట్ల విక్రయం

CRDA plots ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన ఫ్లాట్ల విక్రయాలకు పెద్దగా స్పందన రాకపోవడంతో ప్రభుత్వం వాటిని వాయిదా పద్ధతిలో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సిఆర్‌డిఏ పరిధిలోని నాలుగు లే ఔట్లలో ఉన్న ఫ్లాట్లను వాయిదా పద్ధతిలో ప్రజలు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సిఆర్‌డిఏ అధికారులు ప్రకటించారు.

సిఆర్‌డిఏ నిర్వహించే ఈ ఆక్షన్‌ పాల్గొనే వారికి సులువుగా ఫ్లాట్లను విక్రయించేలా మార్పులు చేసినట్లు సిఆర్‌డిఏ కమిషనర్‌ వివేక్ యాదవ్ ప్రకటించారు. ఈ ఆక్షన్‌లో వేలం పాడుకునే ఫ్లాట్లను మొబైల్‌ ఫోన్‌ ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు వీలు కల్పించనున్నారు.

CRDA plots ఏపీ సిఆర్‌డిఏ అభివృద్ధి చేసిన లే ఔట్‌లలో ప్రస్తుతం 18 లాట్లలో 424 ఫ్లాట్లు విక్రయాలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో రెసిడెన్షియల్, కమర్షియల్ ఫ్లాట్లు ఉన్నాయి. విజయవాడ పాయకాపురంలోని సిఆర్‌డిఏ టౌన్‌షిప్‌, ఇబ్రహీంపట్నం ట్రక్‌ టెర్మినల్‌, తాడేపల్లి-మంగళగిరి కార్పోరేషన్‌ పరిధిలోని అమరావతి టౌన్‌షిప్‌, తెనాలి చెంచుపేట టౌన్‌షిప్‌లలో ఖాళీగా ఉన్న ఫ్లాట్లను విక్రయించాలని సిఆర్‌డిఏ భావిస్తోంది. దీని కోసం ఇటీవల ఈ ఆక్షన్‌ కూడా నిర్వహించారు. వాటిని కొనేందుకు ఎవరు ముందుకు రాలేదు.

ఎన్టీఆర్‌ జిల్లాతో పాటు గుంటూరు జిల్లాలో ఉన్న ఫ్లాట్లను విక్రయానికి పెట్టారు. తాజా నిర్ణయంతో విక్రయాల వల్ల రూ.1.25లక్షల నుంచి రూ.1.18కోట్ల వరకు ప్రయోజనాలు కొనుగోలుదారులకు లభిస్తాయని సిఆర్‌డిఏ కమిషనర్‌ చెప్పారు. సిఆర్‌డిఏతో అగ్రిమెంట్‌ చేసుకున్న నెలలోపు పూర్తి స్థాయి పేమెంట్ చేస్తే కొనుగోలు ధరలో 5శాతం రిబేట్ ఇస్తారు. దీని వల్ల కొనుగోలు దారులకు భారీగా లబ్ది కలుగనుంది. ఫ్లాట్ల విక్రయ ధరలో 60శాతాన్ని భూమి విలువగా, 40శాతాన్ని డెవలప్‌మెంట్‌ విలువగా నిర్ణయించారు. కొనుగోలు విలువల 60శాతం ధరకు మాత్రమే రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేస్తారు.

CRDA plots కొనుగోలు చేయాలనుకునే వారు సిఆర్‌డిఊ వెబ్‌సైట్‌ https://konugolu.ap.gov.in లో వివరాలు చూడవచ్చు. దీంతో పాటు సిఆర్‌డిఏ వెబ్‌సైట్‌ https://crcda.ap.gov.in లో సిఆర్‌‌డిఏ విక్రయాలకు పెట్టిన ఫ్లాట్ల వివరాలను పొందుపరిచారు. సెప్టెంబర్‌ 19 నుంచి ఫ్లాట్ల కొనుగోలు విండో ఓపెన్ అవుతుంది. అక్టోబర్‌ 10వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు ప్రజలు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆక్టోబర్‌ 13వ తేదీ ఉదయం 11 నుంచి 5 గంటల వరకు ఈ ఆక్షన్ నిర్వహిస్తారు.

IPL_Entry_Point

టాపిక్