New Districts In AP | ఏపీలో వ్యక్తుల పేర్లతో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? విస్తీర్ణంలో పెద్ద జిల్లా ఏది?-prakasam district is bigger in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Prakasam District Is Bigger In Andhra Pradesh

New Districts In AP | ఏపీలో వ్యక్తుల పేర్లతో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? విస్తీర్ణంలో పెద్ద జిల్లా ఏది?

HT Telugu Desk HT Telugu
Apr 04, 2022 10:19 AM IST

ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. మెుత్తం 26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ జిల్లాల్లో విస్తీర్ణంలో పెద్ద జిల్లా ఏదీ? జనాభా ఎక్కువ ఉన్న జిల్లా పేరేంటి? రాష్ట్రంలో మెుత్తం ఎన్ని జిల్లాలకు వ్యక్తుల పేర్లు ఉన్నాయి?

ఏపీ కొత్త జిల్లాలు
ఏపీ కొత్త జిల్లాలు

ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల అవతరణ జరిగింది. విస్తిర్ణంలో ప్రకాశం జిల్లా మెుదటి స్థానంలో ఉంది. అధిక జనాభా, మండలాలు కలిగిన జిల్లాల్లో నెల్లూరుకు మెుదటి స్థానం. జనాభాలో ప్రకాశం జిల్లా రెండో స్థానంలో ఉంది. ఈ రెండు జిల్లాల్లోనూ 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, 38 మండలాల ఉన్నాయి.

14,322 చ.కి.మీ విస్తీర్ణంతో రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా ప్రకాశం ఉంది. తర్వాత స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా 12,251 చ.కి.మీ, అనంతరం కడప జిల్లా ఉంది. విస్తీర్ణం, మండలాల పరంగా అతి చిన్న జిల్లాగా విశాఖపట్నం ఉంది. 1,048 మాత్రమే విస్తరించి ఉంది. ఎస్‌పీఎస్‌ నెల్లూరు, ప్రకాశం, కడప, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో 240 మండలాలు ఉన్నాయి. ఈ 7 జిల్లాల్లోనే ఎక్కువ మండలాలు ఉన్నాయి. రాష్ట్రంలో 35.35 శాతం మండలాలు ఈ జిల్లాలోనివే.

జిల్లాల విభజనతో ఆసక్తికర పరిణామం జరిగింది. కొన్ని జిల్లాలకు వ్యక్తుల పేర్లు పెట్టారు. అంతకుముందు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు మాత్రమే వ్యక్తుల పేర్లు ఉండేవి. తాజాగా మరికొన్ని జిల్లాలకు సైతం వ్యక్తుల పేర్లు పెట్టారు. మెుత్తం ఏపీలో 7 జిల్లాలకు వ్యక్తుల పేర్లు ఉన్నాయి. మెుదట కొన్ని పేర్లు ఉండగా.. ఇప్పుడు తాజాగా మరికొంతమంది వ్యక్తుల పేర్లను జిల్లాలకు పెట్టారు.

మెుదట ప్రకాశం జిల్లా వ్యక్తుల పేరుతో ఏర్పడింది. టంగుటూరి ప్రకాశం పంతులు సేవలకు గుర్తుగా 1972లో ఒంగోలు పేరు మార్చి.. ప్రకాశం పేరు పెట్టారు. ఆంధ్రరాష్ట్ర అవతరణకు తన జవితాన్నే త్యాగం చేసిన పొట్టి శ్రీరాములుకు పేరును 2008లో నెల్లూరు జిల్లాకు పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పని చేసి.. పేదలకు ఎంతో సేవ చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గుర్తుగా 2010లో వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చారు.

ఇప్పుడు కొత్తగా మరికొన్ని జిల్లాకు సైతం వ్యక్తుల పేర్లు పెట్టారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా విభజించారు. పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు పేరిట జిల్లా ఏర్పాటైంది. బ్రిటీష్ సైన్యంపై ఆయన విరోచితంగా పోరాడారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరును.. విజయవాడ కేంద్రంగా ఏర్పడిన జిల్లాకు పేరు పెట్టారు. ఎన్టీఆర్ కృష్ణాగా మార్చారు. శ్రీవారి భక్తుడు, వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్యది కడప జిల్లా. కడప నుంచి కొత్తగా రాయచోటి కేంద్రంగా ఏర్పడిన జిల్లాకు అన్నమయ్య జిల్లాగా పేరు పెట్టారు. మరోవైపు.. పుట్టపర్తి సత్యసాయి బాబా సేవలకు గుర్తుగా ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టారు. మెుత్తం వ్యక్తుల పేర్లతో ఏపీలో 7 జిల్లాలు ఉన్నాయి.

IPL_Entry_Point