Visakha Metro: మెట్రో నిర్మాణంపై ఆంధ్రా నుంచి ప్రతిపాదన రాలేదన్న కేంద్రం-muad minister says in rajya sabha andhra pradesh government didnt send any proposals for visakha metro project ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Muad Minister Says In Rajya Sabha Andhra Pradesh Government Didnt Send Any Proposals For Visakha Metro Project

Visakha Metro: మెట్రో నిర్మాణంపై ఆంధ్రా నుంచి ప్రతిపాదన రాలేదన్న కేంద్రం

HT Telugu Desk HT Telugu
Mar 21, 2023 10:21 AM IST

Visakha Metro: విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలూ రాలేదని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీ ప్రకటించారు. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి బదులిచ్చారు.

బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహరావు
బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహరావు (ANI)

Visakha Metro: విశాఖ మెట్రోరైలు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలూ రాలేదని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ స్పష్ట చేశారు. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు అడిగిన ప్రశ్నకు కేంంద్రమంత్రి బదులిచ్చారు. '

దేశంలో పలు నగరాల్లో 'మెట్రోరైలు వ్యవస్థను ప్రణాళికా బద్ధంగా అమలుచేసి సుస్థిరంగా మార్చేందుకు మెట్రోరైల్‌ పాలసీ-2017ను రూపొందించామని కేంద్రం గుర్తు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ఇంతవరకూ నూతన పాలసీ ప్రకారం ఎలాంటి ప్రతిపాదనలూ పంప లేదన్నారు.

2018లో తాము పీపీపీ విధానంలో లైట్‌రైల్‌ ప్రాజెక్టు నిర్మించాలనుకుంటున్నామని, దానికి కొరియన్‌ ఎగ్జిమ్‌ బ్యాంకు నుంచి ఆర్థికసాయం పొందడానికి సహకరించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఆ ప్రాజెక్టుకు సాయం చేయడానికి కొరియన్‌ బ్యాంకు నిస్సహాయత వ్యక్తంచేసింది. ఆ విషయాన్ని 2019 ఏప్రిల్‌లో ఏపీ ప్రభుత్వానికి చెప్పామని, ఆ ప్రాజెక్టుకు రుణసాయం కోసం ఇతర సంస్థలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించామన్నారు. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం రుణ సమీకరణ కోసం మరే విదేశీ సంస్థకూ దరఖాస్తు సమర్పించలేదని కేంద్ర మంత్రి హర్‌ దీప్‌సింగ్‌ తెలిపారు.

విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని జివిఎల్ ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం కనీస ప్రతిపాదనకు కూడా పంపలేదని విమర్శించారు. విశాఖ మెట్రో నిర్మాణంపై కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రతిపాదన లేదని తేల్చి చెప్పారని జివిఎల్ వివరించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018 సంవత్సరంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ కింద లైట్ రైల్ ప్రాజెక్ట్‌ను నిర్మించాలనుకుంటున్నట్లు తెలియజేసిందని, కొరియాకు చెందిన కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్ నుండి ఆర్థిక సహాయం కోసమై భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించిందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ప్రతిపాదనను భారత ప్రభుత్వం కొరియన్ EXIM బ్యాంక్‌కు అందించగా సంబంధిత బ్యాంక్ ఈ ప్రాజెక్ట్‌కు నిధులు అందించలేమని తెలియచేసిందని చెప్పారు.

ఎగ్జిమ్ బ్యాంకు అందించిన సమాచారాన్ని ఏప్రిల్, 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం తెలిపిందని, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్ట్ ప్రతిపాదన విషయమై రుణ సహాయం కోసం ఇతర ఏజెన్సీలకు సంప్రదించవచ్చని సలహా ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు విశాఖపట్నం లైట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం ఇతర ఏజెన్సీ నుండి ఆర్థిక సహాయం ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించ లేదని కేంద్ర మంత్రి తెలియజేశారు.

విశాఖపట్నంకు ఎంతో అవసరమైన మెట్రో రైలు ప్రాజెక్టు రాకపోవడానికి వైసీపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, నిరాసక్తి కారణమని జివిఎల్ ఆరోపించారు. వైసిపి ప్రభుత్వం విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి కొత్త ప్రతిపాదనలు రూపొందించి, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (విజిఎఫ్) కోసం కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రధాని మోడీ రైల్వే రంగంలో వందే భారత్ రైలు వంటి విప్లవాత్మకమైన అభివృద్ధి చూపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెట్రో రైలు వంటి అవకాశాలను అందిపుచ్చుకోలేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యానికి మరియు చేతకానితనానికి నిదర్శనం. ఇది విశాఖ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమని జివిఎల్ విమర్శించారు.

 

IPL_Entry_Point