CM YS Jagn : నెల్లూరులో సంగం బ్యారేజీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సిఎం జగన్-cm ys jagn inaugurated mekapti gowtam sangam barrage in nellore ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Cm Ys Jagn Inaugurated Mekapti Gowtam Sangam Barrage In Nellore

CM YS Jagn : నెల్లూరులో సంగం బ్యారేజీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సిఎం జగన్

B.S.Chandra HT Telugu
Sep 06, 2022 01:52 PM IST

నెల్లూరు జిల్లాల్లో రూ.300కోట్లతో నిర్మించిన రెండు భారీ సాగునీటి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. మేకపాటి గౌతమ్‌ రెడ్డి స్మారకార్థం సంగం బ్యారేజీకి ఇచ్చిన మాట ప్రకారం ఆయన పేరే పెడుతున్నట్లు చెప్పారు. ఆత్మకూరు నియోజక వర్గానికి రూ.85కోట్ల విలువైన ప్రాజెక్టుల్ని మంజూరు చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు.

నెల్లూరు సంగం బ్యారేజీ వద్ద పెన్నా నదికి పూజలు నిర్వహిస్తున్న సిఎం
నెల్లూరు సంగం బ్యారేజీ వద్ద పెన్నా నదికి పూజలు నిర్వహిస్తున్న సిఎం

CM YS Jagn నెల్లూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. పెన్నా నదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించి, నీటిని విడుదల చేశారు.

వరుసగా నాలుగో ఏడాది రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయని, రైతు మీద, రైతాంగం మీద నాలుగేళ్లలో ఏ ఒక్క ఏడాది ఒక్క మండలాన్ని కూడా కరవు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదని సంగం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో సిఎం CM YS Jagn చెప్పారు. మేకపాటి గౌతమ్‌ రెడ్డి సంగం బ్యారేజీని ప్రారంభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే 3.85లక్షల ఎకరాలకు వరప్రదాయిని అయిన సంగం ప్రాజెక్టకు ప్రాధాన్యమిచ్చి నిర్మాణంలో వేగం పెంచినట్లు చెప్పారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 9నెలలకే కోవిడ్ సమస్య వచ్చిందని, ఓ వైపు కరోనా సమస్యను అధిగమిస్తూ, వరుసగా రెండేళ్ల పాటు పెన్నా నదిలో వరదలు, ప్రతికూల పరిస్థితులు వచ్చినా మూడేళ్లలోనే 320కోట్ల రుపాయల ఖర్చు చేసి రెండు ప్రాజెక్టులు పూర్తి చేసి జాతికి అంకితం చేశామని చెప్పారు.

<p>సంగం బ్యారేజీ వద్ద వైఎస్సార్‌ విగ్రహావిష్కరణ</p>
సంగం బ్యారేజీ వద్ద వైఎస్సార్‌ విగ్రహావిష్కరణ

నెల్లూరులో పెన్నా నదిపై 140ఏళ్ల క్రితం బ్రిటిష్‌ హయంలో కట్టిన ఆనకట్టలు కాలక్రమేణా శిథిలావస్థకు చేరడంతో కొత్త ప్రాజెక్టులు అవసరం అయ్యాయని CM YS Jagn చెప్పారు. అప్పట్లో నెల్లూరు జిల్లాకు మేలు చేయాలని ఏ ఒక్కరికి ఆలోచన రాలేదని, వైఎస్సార్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే నెల్లూరుకు మోక్షం వచ్చినట్లు చెప్పారు. 2008లో సంగం ప్రాజెక్టు పనులు ప్రారంభించారని, వైఎస్‌ కొడుకుగా, ముఖ్యమంత్రిగా, వైఎస్సార్‌ ప్రారంభించిన ప్రాజెక్టుల్ని ప్రారంభిస్తున్నందుకు గర్వ పడుతున్నట్లు చెప్పారు.

వైఎస్‌ హయంలో ప్రాజెక్టు పనులు ప్రారంభమైతే, 2009లో వైఎస్‌ మరణంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయని, 2014లో ఉమ్మడి రాష్ట్రంలో పునాదులు మిగిలాయన్నారు. 2014-19 మధ్య 30.85కోట్లు మాత్రమే ఐదేళ్లలో ఖర్చు చేశారని, 2017, 2018,2019 నాటికి పూర్తి చేస్తామని కాలం గడిపేశారని CM YS Jagn ఆరోపించారు.

<p>సంగం బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన మేకపాటి &nbsp;గౌతమ్‌ రెడ్డి విగ్రహం</p>
సంగం బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన మేకపాటి &nbsp;గౌతమ్‌ రెడ్డి విగ్రహం

ప్రాజెక్టులలో రేట్లు పెంచడం, సాగునీటి ప్రాజెక్టుల్లో ఎస్కలేషన్‌ చేయడం తప్ప బాబు హయంలో ఏమి జరగలేదన్నారు. సంగం బ్యారేజీ కోసం రూ.200కోట్లు ఖర్చు చేసి పూర్తి చేసినట్లు వివరించారు. మూడేళ్లలో రూ.200కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు పూర్తి చేశామన్నారు. ప్రాజెక్టు పూర్తి చేసి స్నేహితుడు, ఆత్మీయుడు మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెట్టానని, ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొనాల్సిన గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్ధం ఆయన పేరు పెడుతున్నట్లు CM YS Jagn ప్రకటించారు.గౌతమ్ చిరస్థాయిగా నిలిచిపోయేందుకు సంగం బ్యారేజీకి ఆ‍యన పేరును ప్రాజెక్టుకు పెడుతున్నామని, సంస్మరణ సభలో చెప్పినట్లు చేసినట్లు చెప్పారు. 3.85లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని, నెల్లూరు బ్యారేజీతో లక్ష ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు.

శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు 26 ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో నిర్మిస్తున్నట్లు సిఎం CM YS Jagn చెప్పారు. రాష్ట్రానికి మంచి చేసే అవకాశాన్ని ఇవ్వాలని కోరారు. సంగం బ్యారేజీ ప్రారంభం సందర్భంగా సంగం బ్యారేజీ నుంచి నేరుగా రోడ్డు నిర్మాణానికి 15కోట్లు కేటాయించారు. నియోజక వర్గంలో ఇరిగేషన్‌ పనులకు సంబంధించిన 40కోట్లను మంజూరు చేశారు. రోడ్లు లేని 25 ఊళ్లకు 14కోట్లతో రోడ్లు నిర్మాణం చేపడతారు. ఆత్మకూరు మునిసిపాలిటీకి స్పెషల్ గ్రాంటు 12కోట్లు ప్రకటించారు. సంగం ప్రాజెక్టు నుంచి సంగం పంచాయితీకి నీటి విడుదలకు నాలుగు కోట్లు కేటాయించారు. మొత్తంగా ఆత్మకూరుకు 85కోట్లను మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి CM YS Jagn ప్రకటించారు.

IPL_Entry_Point