AP Capital| ఏపీకి రాజధాని ఎక్కడ? క్లారిటీ ఇచ్చిన కేంద్రం-central government clarity on ap capital and says amaravathi is the capital ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Central Government Clarity On Ap Capital And Says Amaravathi Is The Capital

AP Capital| ఏపీకి రాజధాని ఎక్కడ? క్లారిటీ ఇచ్చిన కేంద్రం

HT Telugu Desk HT Telugu
Feb 02, 2022 12:47 PM IST

రాజ్యసభలో బుధవారం అమరావతి రాజధానిపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఏపీ రాజధానిపై క్లారిటీ ఇవ్వాలని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహరావు ప్రశ్న లేవనెత్తగా.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ స్పష్టత ఇచ్చారు.

ఏపీకి రాజధాని
ఏపీకి రాజధాని (AP state Portyal)

రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లవుతున్నా.. ఆంధ్రప్రదేశ్‌కు రాజధానేంటో తెలియని ధీన స్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తెదేపా ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించి అందుకు తగినట్లుగా భూసేకరణ కూడా చేసింది. అనంతరం కాలంలో అమరావతిలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పలు ఇతర నిర్మాణాలు కూడా చెపట్టింది. అయితే 2019లో అధికారంలోకి వైకాపా రావడంచో సీన్ అడ్డం తిరిగింది. కొన్ని రోజుల్లోనే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అటు వైపుగా కూడా ఇప్పటివరకు సరైన ముందడుగు పడలేదు. అనంతరం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో ఏపీకి రాజధాని ఏది ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటికే పలుమార్లు ఈ అంశం చర్చకు రాగా.. కేంద్రం క్లారిటీ ఇచ్చింది. తాజాగా మరోసారి ఈ ప్రశ్నకు స్పష్టత ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

కేంద్రం క్లారిటీ..

రాజ్యసభలో బుధవారం అమరావతి రాజధానిపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఏపీ రాజధానిపై క్లారిటీ ఇవ్వాలని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహరావు ప్రశ్న లేవనెత్తగా.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ స్పష్టత ఇచ్చారు. తమ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అమరావతేనని బదులిచ్చారు. "మొదట ఏపీకి రాజధానిగా అమరావతి అని సమాచారం ఇచ్చారు. అనంతరం మూడు రాజధానులని, పాలనా పరంగా విశాఖపట్నం, జ్యూడిషయల్‌కు కర్నూలు, లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌గా అమరావతి అని చెప్పారు. అయితే ఈ బిల్లును వెనక్కి తీసుకున్నట్లు వార్తల ద్వారా తెలుసుకున్నాం. క్యాపిటల్‌పై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రానికే ఉంటుంది" అని కేంద్రమంత్రి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి అమరావతే ఏపీకి రాజధాని అని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే రాజధాని అంశంపై ఆర్పీఐకు రాసిన లేఖ ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటు చేయాలని అమరావతి అభివృద్ధి సంస్థ ఛైర్మన్ జాస్తి వీరంజనేయులు గతేడాది అక్టోబరు 12న ఆర్బీఐకు లేఖ రాశారు. ఈ విషయంపై ఆర్బీఐ డిప్యూటీ మేనేజర్ ఎంకే సుభాశ్రీ స్పందిస్తూ వీరాంజనేయులకు తిరిగి ఓ లేఖ పంపారు. ఏపీ రాష్ట్ర రాజధాని ఎక్కడో నిర్ణయించాకే తమ కార్యాలయం ఏర్పాటు చేస్తామని అందులో ప్రస్తావించారు.

 

IPL_Entry_Point

సంబంధిత కథనం