Weather News | వాతావరణ శాఖ చల్లటి కబురు.. వర్షాలు కురిసే అవకాశం-ap weather news rain alert for coming two days ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Weather News | వాతావరణ శాఖ చల్లటి కబురు.. వర్షాలు కురిసే అవకాశం

Weather News | వాతావరణ శాఖ చల్లటి కబురు.. వర్షాలు కురిసే అవకాశం

HT Telugu Desk HT Telugu
Apr 14, 2022 07:48 PM IST

ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనాలకు కాస్త ఉపశమరన దక్కనుంది. రానున్న రెండుమూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని.. వాతారవణ శాఖ వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ, రేపు స్వల్పంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. రాయలసీమలో ఒకటి రెండు చోట్ల ఇవాళ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీలోని పలు ప్రాంతాలకు ఇవాళ వర్ష సూచన ఉంది. దక్షిణ బంగాళాఖాత నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఉభయగోదావరి జిల్లాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉంది. ఇక సీమ జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతాయి. మరోవైపు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలతో పాటు ఉక్కపోత ఎక్కువగానే ఉంటుంది. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 37 -40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఎండలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో గొడుగులు వాడటం మంచిదని సలహా ఇస్తున్నారు. ఎక్కువ మోతాదులో మంచినీళ్లు తీసుకోవాలని చెబుతున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్