High Court On Rushikonda : గూగుల్ మ్యాప్‌ అబద్ధం చెబుతుందా? ప్రభుత్వం ఏదో దాస్తోంది?-ap high court key comments on rushikonda hill case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  High Court On Rushikonda : గూగుల్ మ్యాప్‌ అబద్ధం చెబుతుందా? ప్రభుత్వం ఏదో దాస్తోంది?

High Court On Rushikonda : గూగుల్ మ్యాప్‌ అబద్ధం చెబుతుందా? ప్రభుత్వం ఏదో దాస్తోంది?

HT Telugu Desk HT Telugu
Oct 13, 2022 02:53 PM IST

AP High Court Key Comments రుషికొండ తవ్వకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అభివృద్ధి పేరిట కొండలను కొట్టేస్తున్నారని పేర్కొంది.

పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

రుషికొండ(Rushikonda) తవ్వకాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అభివృద్ది కోసం పాదయాత్ర చేస్తుంటే ఆ ప్రాంతానికి రానివ్వమంటున్నారని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం(Govt)లో విభిన్న వైఖరులేంటి? అని ప్రశ్నించింది. ప్రభుత్వం వైపు నుంచి ఏదో దాస్తున్నట్టు కనిపిస్తోందని పేర్కొంది. కేంద్ర అటవీశాఖ(Forest Department) ఆధ్వర్యంలో తనిఖీ చేయాలని పంపుతామని స్పష్టం చేసింది. కమిటీ వేస్తే ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వానికి ప్రశ్నలు వేసింది.

9.88 ఎకరాలకు అనుమతిస్తే 20 ఎకరాల్లో తవ్వకాలు చేశారని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. గూగుల్ మ్యాప్‌(Google Map)లను అందించారు. 9.88 ఎకరాలకే తవ్వకాలు, నిర్మాణాలు చేపట్టామని ప్రభుత్వ న్యాయవాది నిరంజన్‌రెడ్డి చెప్పారు. గూగుల్ మ్యాప్‌లు అబద్ధాలు చెబుతాయా అని హైకోర్టు(High Court) అడిగింది. అఫిడవిట్ దాఖలుకు సమయం కోరింది ప్రభుత్వం. ప్రభుత్వం ఏదో దాస్తున్నట్టు ఉందని సందేహం వ్యక్తంచేసిన హైకోర్టు.. అఫిడవిట్ వేసిన తర్వాత వాస్తవాలు తేలుస్తామని చెప్పింది. కేసు విచారణ నవంబర్ 3 కు వాయిదా వేసింది.

IPL_Entry_Point