AP HC Advocate Elections : ఉత్కంఠభరితంగా ఏపీ హైకోర్టు ఎన్నికలు-andhra pradesh high court advocate association elections janaki rami reddy won second time ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh High Court Advocate Association Elections Janaki Rami Reddy Won Second Time

AP HC Advocate Elections : ఉత్కంఠభరితంగా ఏపీ హైకోర్టు ఎన్నికలు

HT Telugu Desk HT Telugu
Feb 24, 2023 09:52 AM IST

AP HC Advocate Elections ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయ‌వాదుల సంఘం ఎన్నిక‌లు ఉత్కంఠభరితంగా జ‌రిగాయి. నేల‌పాడులోని హైకోర్టు ప్రాంగ‌ణంలో జ‌రిగిన ఈ ఎన్నిక‌ల్లో గ‌తంలో అధ్య‌క్షుడిగా ఉన్న కె.జాన‌కిరామిరెడ్డి వ‌రుస‌గా రెండోసారి కూడా అధ్య‌క్షునిగా ఎన్నిక‌య్యారు.

హైకోర్టు న్యాయవాదుల సంఘం ఎన్నికల్లో జానకిరామిరెడ్డి విజయం
హైకోర్టు న్యాయవాదుల సంఘం ఎన్నికల్లో జానకిరామిరెడ్డి విజయం

AP HC Advocate Elections ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా జానకి రామిరెడ్డి వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఇలా ఒకే వ్య‌క్తి రెండుసార్లు వ‌రుస‌గా ఎన్నిక కావ‌డం రాష్ట్ర హైకోర్టు చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌ధ‌మమని న్యాయవాదులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఏపి హైకోర్టు న్యాయ‌వాదుల సంఘం ఉపాధ్య‌క్షునిగా పి.ఎస్‌.పి.సురేష్‌కుమార్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా వి.సాయికుమార్‌, జాయింట్ సెక్ర‌ట‌రీగా సాల్మ‌న్‌రాజు, కోశాధికారిగా అప‌ర్ణ‌ల‌క్ష్మి, లైబ్ర‌రీ కార్య‌ద‌ర్శిగా జ్ఞానేశ్వ‌ర‌రావు, స్సోర్ట్స్ అండ్ క‌ల్చ‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా పితాని చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, మ‌హిళా న్యాయ‌వాదుల ప్ర‌తినిధిగా సుధారాణి, సీనియ‌ర్ ఎగ్జిక్యూటీవ్ మెంబ‌ర్లుగా శ్రీధ‌ర్‌, డీయం విద్యాసాగ‌ర్ ఎన్నిక‌య్యారు.

ఎన్నిక‌ల‌కు సంబంధించి మొత్తం 2540 ఓట్ల‌కు గాను 1444 మంది న్యాయ‌వాదులు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. జాన‌కిరామిరెడ్డి వ‌రుస‌గా రెండోసారి ఎన్నిక కావ‌డం ప‌ట్ల న్యాయ‌వాదులు సంబ‌రాలు జ‌రుపుకున్నారు. జాన‌కిరామిరెడ్డితో పాటు నూత‌న కార్య‌వ‌ర్గాన్ని ఘ‌నంగా స‌త్క‌రించారు.

రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్ష ఎన్నికల్లో కె.జానకిరామిరెడ్డికి 703 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి, సీనియర్‌ న్యాయవాది వి.వేణుగోపాలరావుకు 683 ఓట్లు వచ్చాయి. 20 ఓట్ల ఆధిక్యంతో జానకిరామిరెడ్డి గెలిచారు. మరో అభ్యర్థి డీఎస్‌ఎన్వీ ప్రసాదబాబుకు 38 ఓట్లు వచ్చాయి.

ఉపాధ్యక్షుడిగా పీఎస్పీ సురేశ్‌కుమార్‌ గెలిచారు. ఆయనకు 739 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి జి.తుహిన్‌కుమార్‌కు 687 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా వి.సాయికుమార్‌ విజయం సాధించారు. ఆయనకు 780 ఓట్లురాగా సమీప అభ్యర్థి టి.సింగయ్యగౌడ్‌కు 638 ఓట్లు వచ్చాయి.

సంయుక్త కార్యదర్శిగా ఎం.సాల్మన్‌రాజు, గ్రంథాలయ కార్యదర్శిగా మిత్తిరెడ్డి జ్ఞానేశ్వరరావు, కోశాధికారిగా బీవీ అపర్ణలక్ష్మి, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా పితాని చంద్రశేఖర్‌రెడ్డి గెలుపొందారు. మహిళా ప్రతినిధిగా రేవనూరు సుధారాణి ఏకగ్రీవమయ్యారు. కార్యనిర్వహణ సభ్యులుగా అన్నం శ్రీధర్‌, కార్యనిర్వహణ డి.మారుతి విద్యాసాగర్‌, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మహిళ సభ్యురాలు కాశీ అన్నపూర్ణ గెలుపొందారు.

ఈసీ సభ్యులుగా 12మంది బరిలో ఉండగా నలుగురు ఎంపికయ్యారు. గురువారం హైకోర్టు ప్రాంగణంలో ఈ ఎన్నికలు జరిగాయి. 2,540 ఓట్లకుగాను 1,438 మంది న్యాయవాదులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారిగా సీనియర్‌ న్యాయవాది ఎం.విజయకుమార్‌ వ్యవహరించారు.

IPL_Entry_Point

టాపిక్