Akshaya tritiya 2024: అనేక శుభ యోగాలతో అక్షయ తృతీయ.. షాపింగ్ చేసేందుకు ఉత్తమ సమయం ఇదే-lot of shubha yogas in akshaya tritiya 2024 date shubha muhurtham and shopping time ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Akshaya Tritiya 2024: అనేక శుభ యోగాలతో అక్షయ తృతీయ.. షాపింగ్ చేసేందుకు ఉత్తమ సమయం ఇదే

Akshaya tritiya 2024: అనేక శుభ యోగాలతో అక్షయ తృతీయ.. షాపింగ్ చేసేందుకు ఉత్తమ సమయం ఇదే

Gunti Soundarya HT Telugu
Apr 29, 2024 03:27 PM IST

Akshaya tritiya 2024: ఈ ఏడాది అక్షయ తృతీయ అనేక శుభ యోగాలను తీసుకొస్తుంది. పవిత్రమైన ఈరోజు షాపింగ్ చేసేందుకు ఉత్తమమైన సమయంతో పాటు అనేక వివరాల గురించి తెలుసుకుందాం.

అనేక శుభ యోగాలతో అక్షయ తృతీయ
అనేక శుభ యోగాలతో అక్షయ తృతీయ (freepik )

Akshaya tritiya 2024: ఏటా వైశాఖ మాసం శుక్ల పక్షం మూడో రోజున అక్షయ తృతీయ వస్తుంది. ఈ ఏడాది అక్షయ మే 10న వచ్చింది. హిందూ శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.

ఈ పండుగ గజకేసరి, శశ యోగం, సుకర్మ యోగంలో వస్తుంది. ఇది చాలా పవిత్రమైనది. శుభకార్యాలు నిర్వహించేందుకు షాపింగ్ చేసేందుకు కొనుగోలుదారులకు ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది. అక్షయ తృతీయ రోజున రోహిణి నక్షత్రం ఉంటే దాని ప్రాముఖ్యత వెయ్యి రెట్లు పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

అక్షయ తృతీయ శుభ ముహూర్తం 

రోహిణి నక్షత్రం మే 10 ఉదయం 10:47 గంటల వరకు ఉంటుంది. అక్షయ తృతీయ పూజకు ఉత్తమ సమయం ఉదయం 7:44 గంటల నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయను స్వయం సిద్ద ముహూర్తం అని కూడా పిలుస్తారు. అందుకే ఈరోజు ఏ శుభకార్యం జరిగిన అది శుభ ఫలితాలను ఇస్తుంది. 

దానం ప్రదానం 

మత్స్య పురాణం ప్రకారం అక్షయ తృతీయఏ రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని పూజించడం వల్ల ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు పవిత్ర నదులలో స్నానం ఆచరించి శక్తి మేరకు మీరు దానాలు చేయాలి. చెరకు, పెరుగు, సత్తు, వస్త్రాలు వంటి వాటిని దానం చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. శాస్త్రీయంగా దానానికి  చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వైశాఖ మాసం ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల చలువ చేసే పదార్థాలు దానం చేస్తే మంచిది. 

విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఆరాధన 

అక్షయ తృతీయ హిందూ శాస్త్రం ప్రకారం చాలా ముఖ్యమైనది. మహావిష్ణువు ఆరవ అవతారమైన పరుశురాముడు ఈరోజే జన్మించాడు. ఈరోజునే గంగ భూలోకానికి దిగి వచ్చింది. సత్యయుగం, త్రేతా యుగం, ద్వాపరయుగం ప్రారంభం లెక్కింపు ఈరోజు మొదలవుతుంది. బద్రీనాథ్ ఆలయాన్ని అక్షయ తృతీయ రోజంతా తెరిచే ఉంచుతారు. అటు ఏడాదికి ఒకసారి మాత్రమే బృందావనంలోనే బంకే బిహారీ పాదాలు కనిపిస్తాయి. అది అక్షయ తృతీయ రోజే జరుగుతుంది. అలాగే ఈరోజు గ్రహాల రాజు సూర్యుడు, గ్రహాల రాణి చంద్రుడు తమ మహోన్నత రాత్రిలో ఉంటారు. అక్షయ తృతీయ రోజు షాపింగ్ తో పాటు దాతృత్వానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. 

అక్షయ తృతీయ రోజు అనేక శుభయోగాలు 

జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం సుకర్మ యోగం వల్ల ఆనందం, సంపదని పెంచుతుంది. అక్షయ తృతీయ నాడు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఈ యోగం ఏర్పడుతుంది. ఈరోజు బంగారంతో పాటు వెండి ఇతర వస్తువులు కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈరోజు ఏర్పడే గజకేసరి యోగం వల్ల  విజయం, సంపద, హోదా, ప్రతిష్ట పెరుగుతాయి. చంద్రుడు ఏదైనా రాశితో సంయోగం జరిగినప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది. జాతకంలోని లగ్నం లేదా చంద్రుడు మొదటి, నాలుగు, ఏడు, పదో స్థానంలో శని ఉన్నప్పుడు శశ యోగం  ఏర్పడుతుంది. పంచ మహాపురుష యోగాలలో శశ రాజయోగం ఒకటి.

అక్షయ తృతీయ షాపింగ్ సమయం

ఉదయం 5:30 నుంచి 10.37 వరకు 

మధ్యాహ్నం 12.18 నుంచి 1.59 వరకు

సాయంత్రం 5:21 నుంచి 7.02 గంటల వరకు

రాత్రి 9:40 నుంచి 10.59 గంటల వరకు శుభ సమయం. 

 

WhatsApp channel