T20 World Cup Squads: టీ20 వరల్డ్ కప్ 2024 కోసం జట్లను అనౌన్స్ చేసిన సౌతాఫ్రికా, ఇంగ్లండ్-south africa england announce their t20 world cup 2024 squads team india to announce shortly ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  T20 World Cup Squads: టీ20 వరల్డ్ కప్ 2024 కోసం జట్లను అనౌన్స్ చేసిన సౌతాఫ్రికా, ఇంగ్లండ్

T20 World Cup Squads: టీ20 వరల్డ్ కప్ 2024 కోసం జట్లను అనౌన్స్ చేసిన సౌతాఫ్రికా, ఇంగ్లండ్

Hari Prasad S HT Telugu
Apr 30, 2024 03:11 PM IST

T20 World Cup Squads: టీ20 వరల్డ్ కప్ 2024 కోసం సౌతాఫ్రికా, ఇంగ్లండ్ కూడా తమ జట్లను అనౌన్స్ చేశారు. మంగళవారం (ఏప్రిల్ 30) ఈ రెండు టీమ్స్ తమ జట్లను ప్రకటించాయి.

టీ20 వరల్డ్ కప్ 2024 కోసం జట్లను అనౌన్స్ చేసిన సౌతాఫ్రికా, ఇంగ్లండ్
టీ20 వరల్డ్ కప్ 2024 కోసం జట్లను అనౌన్స్ చేసిన సౌతాఫ్రికా, ఇంగ్లండ్

T20 World Cup Squads: టీ20 వరల్డ్ కప్ 2024 కోసం జట్లను అనౌన్స్ చేయడానికి బుధవారం (మే 1) చివరి తేదీగా ఐసీసీ స్పష్టం చేసింది. దీంతో వరుసగా ఒక్కో టీమ్ తమ జట్లను అనౌన్స్ చేస్తున్నాయి.

సోమవారం (ఏప్రిల్ 29) ఇలా జట్టును అనౌన్స్ చేసి తొలి టీమ్ గా న్యూజిలాండ్ నిలిచింది. తాజాగా మంగళవారం (ఏప్రిల్ 30) సౌతాఫ్రికా, ఇంగ్లండ్ కూడా తమ జట్లను అనౌన్స్ చేశాయి.

టీ20 వరల్డ్ కప్ కోసం సౌతాఫ్రికా జట్టు ఇదే

టీ20 వరల్డ్ కప్ కోసం సౌతాఫ్రికా 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో ఫాస్ట్ బౌలర్ ఎన్రిచ్ నోక్యాతోపాటు ఇప్పటి వరకూ అంతర్జాతీయ క్రికెట్ ఆడని బ్యాటర్ రియాన్ రికెల్టన్, సీమ్ బౌలర్ ఒట్నీల్ బార్ట్‌మాన్ లకు కూడా చోటివ్వడం విశేషం. జూన్ 1 నుంచి 29 వరకు వెస్టిండీస్, యూఎస్ఏలలో ఈ మెగా టోర్నీ జరగనున్న విషయం తెలిసిందే.

ఏడాది కాలంగా గాయాలతో అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్న నోక్యా.. ఈ మధ్యే ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున తిరిగి క్రికెట్ లోకి వచ్చాడు. అయితే ఆరు మ్యాచ్ లలో అతడు ఏకంగా 13.36 ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకున్నాడు. అయినా అతనికి టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటివ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇక ఈ ఏడాది ఎస్ఏ20లో రాణించిన వికెట్ కీపర్ బ్యాటర్ రికెల్టన్ కు జట్టులో స్థానం కల్పించారు. ఈ లీగ్ లో అతడు 530 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక పేసర్ బార్ట్‌మాన్ కూడా ఈ లీగ్ లో 18 వికెట్లతో రాణించాడు. దీంతో ఈ ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా.. నేరుగా టీ20 వరల్డ్ కప్ జట్టులోకి తీసుకున్నారు.

ఏడెన్ మార్క్‌క్రమ్ కెప్టెన్ గా ఉండనున్నాడు. క్లాసెన్, డేవిడ్ మిల్లర్, డికాక్, స్టబ్స్ లాంటి బిగ్ హిట్టర్లు కూడా జట్టులో ఉన్నారు. ఇక కేశవ్ మహరాజ్, బోర్న్ పార్చుయిన్, షంసీల రూపంలో ముగ్గురు స్పిన్నర్లను తీసుకుంది.

సౌతాఫ్రికా టీమ్ టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్ డిలో ఉంది. ఈ గ్రూపులో సఫారీలతోపాటు బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్, శ్రీలంక ఉన్నాయి. సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్ ను జూన్ 3న న్యూయార్క్ లో ఆడనుంది.

సౌతాఫ్రికా టీమ్ ఇదే

ఏడెన్ మార్‌క్రమ్, ఓట్నీల్ బార్ట్‌మాన్, గెరాల్డ్ కొట్జియా, డికాక్, బోర్న్ ఫార్చుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో యాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, ఎన్రిచ్ నోక్యా, కగిసో రబాడా, రియాన్ రికెల్టన్, షంసి, ట్రిస్టన్ స్టబ్స్

ఇంగ్లండ్ జట్టు ప్రకటన

అటు వరల్డ్ కప్ కోసం ఇంగ్లండ్ కూడా తమ జట్టును మంగళవారం (ఏప్రిల్ 30) అనౌన్స్ చేసింది. ఈ జట్టుకు జోస్ బట్లర్ కెప్టెన్ గా ఉన్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇంగ్లండ్.. గ్రూప్ బిలో ఉంది. ఈ గ్రూపులో ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ లాంటి జట్లు ఉన్నాయి.

ఇంగ్లండ్ టీమ్ ఇదే: జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హార్ట్‌లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్

IPL_Entry_Point