Rinku Singh: రింకూ సింగ్‍ను ఎంపిక చేయకపోవడానికి కారణం ఇదేనా! నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే..-reasons behind rinku singh exclusion in t20 world cup indian main squad how netizens reacting ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rinku Singh: రింకూ సింగ్‍ను ఎంపిక చేయకపోవడానికి కారణం ఇదేనా! నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే..

Rinku Singh: రింకూ సింగ్‍ను ఎంపిక చేయకపోవడానికి కారణం ఇదేనా! నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 30, 2024 08:22 PM IST

Rinku Singh - T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత ప్రధాన జట్టులో రింకూ సింగ్ లేకపోవడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Rinku Singh: రింకూ సింగ్‍ను ఎంపిక చేయకపోవడానికి కారణం ఇదేనా! నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే..
Rinku Singh: రింకూ సింగ్‍ను ఎంపిక చేయకపోవడానికి కారణం ఇదేనా! నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే..

Rinku Singh - T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీకి భారత జట్టును బీసీసీఐ ఎట్టకేలకు ప్రకటించింది. కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు ముగింపు పలుకుతూ నేడు (ఏప్రిల్ 30) మెగాటోర్నీకి టీమిండియాను వెల్లడించింది. 15 మంది ఆటగాళ్లతో కూడిన ప్రధాన జట్టుతో పాటు నలుగురిని రిజర్వ్ ప్లేయర్లుగా తీసుకుంది. అయితే, జూన్‍లో జరిగే టీ20 ప్రపంచకప్‍కు భారత ప్రధాన జట్టులో రింకూ సింగ్‍కు చోటు దక్కలేదు. రిజర్వ్ లిస్ట్‌లో ఉన్నాడు. ఈ నిర్ణయంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

రింకూ పర్ఫార్మెన్స్ ఇలా..

కోల్‍కతా నైట్‍రైడర్స్ తరఫున గతేడాది ఐపీఎల్ 2023 సీజన్‍లో 14 మ్యాచ్‍ల్లో 149 స్ట్రైక్‍రేట్‍తో ఏకంగా 474 పరుగులు చేశాడు రింకూ సింగ్. హిట్టింగ్‍తో మెప్పించాడు. ఓ మ్యాచ్‍లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి జట్టును గెలిపించాడు. ఐపీఎల్‍లో మెరుపులతో భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. టీమిండియా తరఫున ఇప్పటి వరకు 15 టీ20ల్లో 176.23 స్టైక్‍రేట్‍తో 356 పరుగులు చేసి సత్తాచాటాడు. అతడి యావరేజ్ ఏకంగా 89 ఉంది. భారత జట్టులోనూ ఫినిషర్‌గా నిరూపించుకున్నాడు. అయితే, టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో భారత ప్రధాన జట్టులో అతడికి చోటు దక్కలేదు.

కారణం ఇదే!

ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్‍లో రింకూ సింగ్‍కు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కోల్‍కతా టాపార్డర్ బ్యాటర్లు రాణిస్తుండటంతో రింకూకు పెద్దగా బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. ఈ సీజన్‍లో 9 మ్యాచ్‍ల్లో రింకూ సింగ్ కేవలం 82 బంతులను మాత్రమే ఎదుర్కొన్నాడు. 123 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, మెరుపించేందుకు అతడికి పెద్దగా అవకాశం రాలేదు. అందులోనూ అంతగా ఫామ్‍లో ఉన్నట్టు రింకూ కనిపించలేదు. దీంతో సెలెక్టర్లు టీ20 ప్రపంచకప్ టీమిండియా ప్రధాన జట్టులో రింకూను తీసుకోనట్టు అర్థమవుతోంది. అందులోనూ శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా ఫినిషర్ల పాత్ర పోషించేందుకు ఉండటం కారణంగానూ రింకూకు ప్లేస్ దక్కలేదు.

అయితే, టీ20 ప్రపంచకప్ 2024కు రిజర్వ్ ఆటగాడిగా రింకూ సింగ్ ఉన్నాడు. ఒకవేళ ప్రధాన జట్టులో ఎవరైనా గాయపడితే రింకూని తీసుకునే అవకాశం ఉంటుంది.

నెటిజన్ల రియాక్షన్ ఇదే..

టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీకి భారత ప్రధాన జట్టులో రింకూ సింగ్‍కు చోటు ఇవ్వకపోవటంతో సెలెక్టర్లపై చాలా మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్వాలిటీ ఫినిషర్‌ను తీసుకోకవడం పెద్ద పొరపాటే అంటూ చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుత ఐపీఎల్‍ను పరిగణనలోకి తీసుకుంటే హార్దిక్ పాండ్యా, సిరాజ్, సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్‍లో లేరు కదా.. వారిని తీసుకొని రింకూను ఎందుకు ఎంపిక చేయలేదని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

రింకూ సింగ్‍ను ప్రపంచకప్ కోసం తీసుకోవాల్సిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్‍లో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోతే తప్పు అతడిదా అని సెలెక్టర్లను ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా టీ20 ప్రపంచకప్ భారత జట్టులో రింకూను తీసుకోకపోవడంపై సెలెక్టర్లపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

టీ20 ప్రపంచకప్‍ 2024కు ఎంపికైన భారత ప్రధాన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్

రిజర్వ్ ఆటగాళ్లు: రింకూ సింగ్, శుభ్‍మన్ గిల్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్

IPL_Entry_Point