Zimbabwe Cricketer Stunning Catch: జింబాబ్వే ప్లేయర్ స్టన్నింగ్ క్యాచ్.. మనిషేనా లేక సూపర్ మ్యానా?-zimbabwe cricketer stunning catch in t20 world cup icc calls him superman ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Zimbabwe Cricketer Stunning Catch In T20 World Cup Icc Calls Him Superman

Zimbabwe Cricketer Stunning Catch: జింబాబ్వే ప్లేయర్ స్టన్నింగ్ క్యాచ్.. మనిషేనా లేక సూపర్ మ్యానా?

Maragani Govardhan HT Telugu
Oct 21, 2022 06:31 PM IST

Zimbabwe Cricketer Stunning Catch: స్కాట్లాండ్‌తో జరిగిన చివరి టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో జింబాబ్వే అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఆటగాడు వెస్లీ అదిరిపోయే క్యాచ్ అందుకున్నాడు.

జింబాబ్వే ప్లేయర్ స్టన్నింగ్ క్యాచ్
జింబాబ్వే ప్లేయర్ స్టన్నింగ్ క్యాచ్ (Instagram)

Zimbabwe Cricketer Stunning Catch: టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ రౌండులో చివరి మ్యాచ్ శుక్రవారం నాడు జింబాబ్వే-స్కాట్లాండ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన జింబాబ్వే గ్రూప్ బీ నుంచి సూపర్ 12 దశకు చేరుకున్న రెండో జట్టుగా నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఆటగాడు అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. స్కాట్లాండ్ బ్యాటర్ ఇచ్చిన క్యాచ్‌ను మెరుపు వేగంతో డైవ్ చేసి కళ్లు చెదిరే రీతిలో ఒడిసి పట్టాడు.

జింబాబ్వే ఆటగాడు వెస్లీ మాదేవేర స్కాట్లాండ్ బ్యాటర్ మ్యాథ్యూ క్రాస్ ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా అందుకున్నాడు. కళ్లు చెదిరిలో రీతిలో గాల్లోకి అమాంతం ఎగిరి రెండు చేతులో ఒడిసి పట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో వీడియోను షేర్ చేసింది. సూపర్ మ్యాన్ క్యాచ్ అంటూ క్యాప్షన్‌ను జోడించింది.

"ఈ క్యాచ్ అందుకున్నది సూపర్‌మ్యానా లేక వెస్లీ మాధవేరేనా" అంటూ పోస్టు పెట్టింది. ఐసీసీ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ విసిరిన 133 పరుగుల టార్గెట్‌ను జింబాబ్వే 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ క్రెయిగ్‌ ఎర్విన్‌ 54 బంతుల్లో 58 రన్స్‌ చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. సికిందర్‌ రజా కూడా 23 బాల్స్‌లో 40 రన్స్‌ చేయడం విశేషం. మిగతా బ్యాటర్లు విఫలమైనా ఈ ఇద్దరూ జింబాబ్వేను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ టీమ్‌.. 20 ఓవర్లలో 6 వికెట్లకు 132 రన్స్‌ చేసింది. ఓపెనర్‌ జార్జ్‌ మన్సీ 51 బాల్స్‌లో 54 రన్స్‌ చేశాడు. జింబాబ్వే బౌలర్లలో చటారా, ఎన్‌గరవా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం