Who is Roger Binny: బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్ రోజర్‌ బిన్నీ.. ఇంతకీ ఎవరీయన?-who is roger binny who elected unopposed as bcci president ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Who Is Roger Binny: బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్ రోజర్‌ బిన్నీ.. ఇంతకీ ఎవరీయన?

Who is Roger Binny: బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్ రోజర్‌ బిన్నీ.. ఇంతకీ ఎవరీయన?

Hari Prasad S HT Telugu
Oct 18, 2022 03:16 PM IST

Who is Roger Binny: బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్‌గా రోజర్‌ బిన్నీ ఎన్నికైన విషయం తెలుసు కదా. మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ తర్వాత బోర్డు బాధ్యతలు బిన్నీ చేతుల్లోకి వెళ్లనున్నాయి. మరి ఇంతకీ ఎవరీయన?

బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ
బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ (AP)

Who is Roger Binny: ప్రపంచంలోనే రిచెస్ట్‌ క్రికెట్‌ బోర్డు బీసీసీఐకి ఇన్నాళ్లూ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్‌ గంగూలీ గురించి ఎవరికీ ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్లలో ఒకరిగా ఆయనకు పేరుంది. ఇప్పుడాయన పదవీకాలం ముగిసింది. మరో అవకాశం ఇవ్వకపోవడంతో తప్పుకున్నారు. గంగూలీ స్థానంలో రోజర్‌ బిన్నీ ఎన్నికైనట్లు మంగళవారం (అక్టోబర్‌ 18) జరిగిన బీసీసీఐ ఏజీఎం వెల్లడించింది.

ఈ పదవి కోసం ఆయన తప్ప మరొకరు నామినేషన్‌ వేయకపోవడంతో బిన్నీ పోటీ లేకుండానే అధ్యక్షుడయ్యారు. ఈ నేపథ్యంలో అసలు ఎవరీ రోజర్‌ బిన్నీ? ఈయనకు గతంలో పరిపాలన అనుభవం ఉందా? మాజీ కోచ్‌ రవిశాస్త్రిలాంటి వాళ్లు ఈయన గురించి అంత గొప్పగా ఎందుకు చెబుతున్నారు?

ఎవరీ రోజర్‌ బిన్నీ?

రోజర్‌ బిన్నీ ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ మాజీ ప్లేయర్‌. 1983లో వరల్డ్‌కప్‌ గెలిచిన టీమ్‌లో సభ్యుడు. 67 ఏళ్ల రోజర్‌ బిన్నీ బీసీసీఐకి 36వ అధ్యక్షుడయ్యారు. ఈయన తనయుడు స్టువర్ట్‌ బిన్నీ కూడా ఇండియన్‌ టీమ్‌కు ఆడిన విషయం తెలిసిందే. బిన్నీ పూర్తి పేరు రోజర్‌ మైకేల్‌ హంఫ్రి బిన్నీ. ఈయన 1955, జులై 19న జన్మించారు. 1983లో ఇండియన్‌ టీమ్‌ వరల్డ్‌కప్‌ గెలవడంలో రోజర్‌ కీలకపాత్ర పోషించారు.

ఆ టోర్నీలో 18 వికెట్లు తీసి అత్యధిక వికెట్ల లిస్ట్‌లో టాప్‌లో నిలిచారు. ఇక 1985లో ఇండియా వరల్డ్ సిరీస్‌ ఛాంపియన్‌షిప్‌ గెలిచినప్పుడు కూడా రోజర్‌ బిన్నీయే 17 వికెట్లతో టాపర్‌గా నిలవడం విశేషం. దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించారు. ఇండియాకు క్రికెట్‌ ఆడిన తొలి ఆంగ్లో-ఇండియన్‌ కమ్యూనిటీ వ్యక్తి కూడా రోజర్‌ బిన్నీయే. మొత్తంగా ఇండియన్‌ టీమ్‌ తరఫున రోజర్‌ బిన్నీ 27 టెస్టులు ఆడారు. 47 వికెట్లు తీసుకున్నాడు. ఇక 72 వన్డేల్లో 77 వికెట్లు తీశారు.

నిజానికి బీసీసీఐ అధ్యక్ష పదవికి రోజర్‌ బిన్నీ పోటీ లేకుండా ఎన్నికవడం ఆశ్చర్యం కలిగించేదే. ఆయన గతంలో కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఎలాంటి వివాదాలు లేవు. ఆయన తనయుడు స్టువర్ట్‌ బిన్నీ ఇండియన్‌ టీమ్‌ రేసులో ఉన్న సమయంలో తన సెలక్టర్‌ పదవిని వదులుకున్న ఘనత రోజర్‌ సొంతం. 2000లో యువరాజ్‌, మహ్మద్‌ కైఫ్‌లాంటి క్రికెటర్లు ఉన్న అండర్‌ 19 టీమ్‌ వరల్డ్‌కప్‌ గెలిచిన సమయంలో కోచ్‌గా రోజర్‌ బిన్నీయే ఉన్నారు.

WhatsApp channel

టాపిక్