Dhawan on Shubman Gill: నేను సెలెక్ట‌ర్‌ అయితే శుభ్‌మ‌న్‌కు ఛాన్స్ ఇస్తా - ధావ‌న్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌-shikhar dhawan says shubman gill better then me as team india opener ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Shikhar Dhawan Says Shubman Gill Better Then Me As Team India Opener

Dhawan on Shubman Gill: నేను సెలెక్ట‌ర్‌ అయితే శుభ్‌మ‌న్‌కు ఛాన్స్ ఇస్తా - ధావ‌న్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 26, 2023 11:27 AM IST

Dhawan on Shubman Gill: తాను సెలెక్ట‌ర్‌ను అయితే ఓపెన‌ర్‌గా శుభ్‌మ‌న్‌గిల్‌ను సెలెక్ట్ చేస్తానంటూ శిఖ‌ర్ ధావ‌న్ చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

శుభ్‌మ‌న్‌గిల్‌
శుభ్‌మ‌న్‌గిల్‌

Dhawan on Shubman Gill: ఓపెన‌ర్‌గా త‌న‌కంటే శుభ్‌మ‌న్‌ గిల్ బెస్ట్‌ అంటూ టీమ్ ఇండియా మాజీ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి. టీమ్ ఇండియా ప్ర‌ధాన ఆట‌గాళ్ల‌లో ఒక‌రిగా వెలుగొందాడు శిఖ‌ర్ ధావ‌న్‌. ఓపెన‌ర్‌గా జ‌ట్టుకు ఎన్నో అద్భుత విజ‌యాల్ని అందించాడు. గ‌త కొంత‌కాలంగా ఫామ్ కోల్పోయి జ‌ట్టుకు దూర‌మ‌య్యాడు. గంభీర్‌, శిఖ‌ర్ ధావ‌ర్ జ‌ట్టుకు దూర‌మైన త‌ర్వాత ఓపెనింగ్ జోడీ ప‌రంగా టీమ్ ఇండియా స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొంటుంది.

కెప్టెన్ రోహిత్‌కు త‌గిన ఓపెనింగ్ భాగ‌స్వామి కుద‌ర‌డం లేదు. ఓపెనింగ్ స‌మ‌స్య గురించి శిఖ‌ర్ ధావ‌న్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌జెంట్ ఓపెన‌ర్‌గా శిఖ‌ర్ ధావ‌న్‌, శుభ్‌మ‌న్‌గిల్‌ల‌లో ఒక‌రికి చోటు ఇవ్వాల్సివ‌స్తే ఎవ‌రు బెస్ట్ అనుకుంటున్నార‌ని అడిగిన ప్ర‌శ్న‌కు త‌న పేరు కాకుండా శుభ్‌మ‌న్ బెట‌ర్ అంటూ స‌మాధానం చెప్పాడు తాను సెలెక్ట‌ర్ ప్లేస్‌లో ఉంటే శుభ్‌మ‌న్‌గిల్‌ను ఓపెన‌ర్‌గా ఎంపిక చేస్తాన‌ని అన్నాడు. టెస్ట్‌ల‌తో పాటు టీ20ల‌లో శుభ్‌మ‌న్ చ‌క్క‌గా రాణిస్తున్నాడ‌ని శిఖ‌ర్ ధావ‌న్ పేర్కొన్నాడు.

కానీ అత‌డికి స‌రైన అవ‌కాశాలు రావ‌డం లేద‌ని తెలిపాడు. ఇంట‌ర్‌నేష‌న‌ల్ మ్యాచ్‌ల‌లో త‌గిన‌న్ని అవ‌కాశాలు ల‌భిస్తే ఆట‌గాడిగా శుభ్‌మ‌న్‌ మ‌రింత రాటుదేలుతాడ‌ని శిఖ‌ర్ ధావ‌న్ అన్నాడు. ఓపెన‌ర్‌గా త‌న‌కంటే శుభ్‌మ‌న్ బెస్ట్‌గా భావిస్తోన్న‌ట్లు ధావ‌న్ పేర్కొన్నాడు. జ‌ట్టుకు దూర‌మ‌య్యాన‌నే బాధ త‌న‌లో లేద‌ని చెప్పాడు. . శుభ్‌మ‌న్‌గిల్‌పై శిఖ‌ర్ ధావ‌న్ చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

WhatsApp channel