Sangakkara on Hardik Captaincy: హార్దిక్‌ పాండ్యా ఇండియాకు మంచి కెప్టెన్‌ అవుతాడు: కుమార సంగక్కర-sangakkara on hardik captaincy says he has all the qualities to be a good indian captain ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sangakkara On Hardik Captaincy: హార్దిక్‌ పాండ్యా ఇండియాకు మంచి కెప్టెన్‌ అవుతాడు: కుమార సంగక్కర

Sangakkara on Hardik Captaincy: హార్దిక్‌ పాండ్యా ఇండియాకు మంచి కెప్టెన్‌ అవుతాడు: కుమార సంగక్కర

Hari Prasad S HT Telugu
Dec 29, 2022 08:35 PM IST

Sangakkara on Hardik Captaincy: హార్దిక్‌ పాండ్యా ఇండియాకు మంచి కెప్టెన్‌ అవుతాడని అన్నాడు శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర. అయితే ఐపీఎల్‌ టీమ్‌ కంటే నేషనల్‌ టీమ్‌ను లీడ్‌ చేయడం పూర్తిగా భిన్నంగా ఉంటుందని చెప్పాడు.

హార్దిక్ పాండ్యా
హార్దిక్ పాండ్యా (ANI)

Sangakkara on Hardik Captaincy: టీ20ల్లో టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్‌గా మారే దిశగా హార్దిక్‌ పాండ్యా మరో అడుగు ముందుకేశాడు. తాజాగా శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌కు కూడా హార్దిక్‌కే కెప్టెన్సీ అప్పగించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఏడాది ఐర్లాండ్‌, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌ టూర్‌లలో టీ20 టీమ్స్‌కు హార్దిక్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. అతని కెప్టెన్సీలో ఈ రెండు సిరీస్‌లను ఇండియా గెలిచింది.

ముఖ్యంగా టీ20 వరల్డ్‌కప్‌లో వైఫల్యం తర్వాత ఈ ఫార్మాట్‌లో హార్దిక్‌కే పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్‌ కెప్టెన్సీ సామర్థ్యంపై శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇండియాకు టీ20 క్రికెట్‌లో మంచి కెప్టెన్ అయ్యే సామర్థ్యం హార్దిక్‌కు ఉందని అతడు అన్నాడు. ఐపీఎల్‌లో హార్దిక్‌ సక్సెసైనా నేషనల్‌ టీమ్‌ కెప్టెన్సీ వేరుగా ఉంటుందని, అయితే హార్దిక్‌ అత్యున్నత స్థాయిలోనూ కెప్టెన్‌గా రాణించగలడని అన్నాడు.

టీ20ల్లో కెప్టెన్‌గానే కాదు వన్డేల్లో హార్దిక్‌ వైస్‌ కెప్టెన్‌ కూడా అయ్యాడు. వైట్‌బాల్‌ క్రికెట్‌ కెప్టెన్సీ మొత్తం హార్దిక్‌కు ఇవ్వాలన్న డిమాండ్ల నేపథ్యంలో ఆ దిశగా తొలి అడుగు పడినట్లే అని చెప్పొచ్చు. "అతని నాయకత్వం అద్భుతమనడంలో సందేహం లేదు. అది మనం ఐపీఎల్‌లోనే చూశాం. ఇప్పుడు నేషనల్‌ టీమ్‌ కెప్టెన్సీకి అతడు అలవాటు పడాలి. అతనికి నాయకుడు అయ్యే అన్ని లక్షణాలు ఉన్నాయి. నాయకుడిగా ఉండటానికి కచ్చితంగా కెప్టెన్‌గా ఉండాల్సిన అవసరం లేదు" అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంగక్కర అభిప్రాయపడ్డాడు.

అయితే కీలకమైన సమయాల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై హార్దిక్‌కు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశాడు సంగక్కర. "ఫీల్డ్‌లో కెప్టెన్సీ భిన్నమైన విషయం. పరిస్థితులను చదవడం, వాటిపై పైచేయి సాధించడం, వ్యూహాలు రచించడం కోసం చురుగ్గా ఉండాలి. మంచి కెప్టెన్‌ అయ్యే లక్షణాలు అన్నీ హార్దిక్‌లో ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఓ గ్రూప్‌గా ప్లేయర్స్‌లో స్ఫూర్తి నింపడం, వారితో మాట్లాడటం, మేనేజ్‌ చేయడం కఠినమైన పని. ఇక మిగతావన్నీ ఉత్కంఠభరిత మ్యాచ్‌లలో కెప్టెన్సీ వల్ల అనుభవంతో వస్తాయి" అని సంగక్కర చెప్పాడు.

శ్రీలంకతో ఎంపిక చేసిన టీ20 టీమ్‌ చూస్తుంటే రానున్న రోజుల్లో భారీ మార్పులు తప్పవని సెలక్టర్లు చెప్పకనే చెప్పారు. దీనిపై సంగక్కర స్పందిస్తూ.. ప్రతి టీమ్‌లోనూ ఈ మార్పులు సహజమని, అయితే యువ ఆటగాళ్లకు తగినంత మద్దతు ఇవ్వాలని అన్నాడు.

"ప్రతి టీమ్‌ కఠినమైన మార్పులను చవిచూస్తుంది. ఆస్ట్రేలియా విషయంలోనూ అది జరిగింది. న్యూజిలాండ్‌ టీమ్‌తోనూ చాలా కాలం ఇలాగే జరిగింది. అన్ని టీమ్స్‌కూ ఇది సహజమే. ఇండియా దగ్గర చాలా మంది యువ ప్లేయర్స్‌ ఉన్నారు. వాళ్ల నుంచి సరైన టీమ్‌ను ఎంపిక చేసి.. వారికి ఎక్కువ సమయం పాట మద్దతుగా ఉండటం ముఖ్యం" అని సంగక్కర అన్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం