Sachin on T20 World Cup Semifinalists: టీ20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌.. సచిన్‌ లిస్ట్‌లో పాకిస్థాన్‌-sachin on t20 world cup semifinalists says india pakistan australia and england would make it ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sachin On T20 World Cup Semifinalists: టీ20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌.. సచిన్‌ లిస్ట్‌లో పాకిస్థాన్‌

Sachin on T20 World Cup Semifinalists: టీ20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌.. సచిన్‌ లిస్ట్‌లో పాకిస్థాన్‌

Hari Prasad S HT Telugu
Oct 20, 2022 12:28 PM IST

Sachin on T20 World Cup Semifinalists: టీ20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌ చేరే టీమ్స్‌ ఏవో అంచనా వేశాడు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌. అతని లిస్ట్‌లో పాకిస్థాన్‌కు కూడా చోటు దక్కడం విశేషం.

టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో టోర్నీలో ఆడబోయే టీమ్స్ కెప్టెన్లు
టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో టోర్నీలో ఆడబోయే టీమ్స్ కెప్టెన్లు

Sachin on T20 World Cup Semifinalists: టీ20 వరల్డ్‌కప్‌ హంగామా మొదలవుతోంది. ఇప్పటికే తొలి రౌండ్‌ మ్యాచ్‌లు ప్రారంభమైనా.. అసలు మజా శనివారం (అక్టోబర్‌ 22) నుంచి ప్రారంభం కాబోయే సూపర్‌ 12 స్టేజ్‌తోనే రానుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య జరగబోయే మ్యాచ్‌తో ఈ సూపర్‌ 12 రౌండ్‌ ప్రారంభం కానుంది. ఇక మరుసటి రోజు అంటే అక్టోబర్‌ 23న ఇండియా, పాకిస్థాన్‌ తలపడనున్నాయి.

ఇప్పటికే వరల్డ్‌కప్‌ విజేతలు, సెమీఫైనల్‌ చేరే టీమ్స్‌పై క్రికెట్‌ పండితులు తమ అంచనాలు చెప్పేశారు. తాజాగా మాస్టర్‌ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్‌ కూడా సెమీస్‌ చేరే నాలుగు జట్లు ఏవో అంచనా వేశాడు. అతని లిస్ట్‌లో ఇండియాతోపాటు పాకిస్థాన్‌కు కూడా చోటు దక్కింది. ఇక డార్క్‌ హార్స్‌లుగా నిలవబోతున్న రెండు టీమ్స్‌ ఏవో కూడా మాస్టర్‌ చెప్పాడు.

"నేను ఎలాగూ ఇండియానే ఛాంపియన్‌గా నిలవాలని కోరుకుంటున్నాను. అయితే నా టాప్ ఫోర్‌ టీమ్స్‌ మాత్రం ఇండియా, పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌. న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా టీమ్స్‌ డార్క్‌ హార్స్‌లు. ఈ కండిషన్స్‌ సెప్టెంబర్‌-అక్టోబర్‌ నెలల్లో సౌతాఫ్రికా టీమ్‌కు తమ సొంతగడ్డపై ఎదురయ్యేవే. దీంతో ఇది ఆ టీమ్‌కు కలిసి వస్తుంది" అని టెలిగ్రాఫ్‌తో సచిన్‌ అన్నాడు.

ఇండియా ఈసారి వరల్డ్‌కప్‌ గెలిచే అవకాశాలు చాలానే ఉన్నాయని కూడా మాస్టర్‌ చెప్పాడు. "కచ్చితంగా మనకు మంచి అవకాశం ఉంది. ఈ టీమ్‌ బ్యాలెన్స్‌ బాగుంది. విజయాలు సాధించే కాంబినేషన్‌ టీమ్‌ దగ్గర ఉంది. నిజానికి మన టీమ్‌ కప్పు గెలుస్తుందన్న నమ్మకం నాకుంది" అని సచిన్‌ చెప్పాడు. ఇక బుమ్రా లేకపోవడం లోటే అయినా.. అతని స్థానంలో వచ్చిన షమి కూడా తనను తాను ప్రూవ్‌ చేసుకున్నాడని టెండూల్కర్‌ అన్నాడు.

"బెస్ట్‌ ఫాస్ట్ బౌలర్స్‌లో ఒకరిని మిస్‌ కావడం నిజంగా టీమ్‌పై ప్రభావం చూపుతుంది. తుది జట్టులో బుమ్రా ఎప్పుడూ ప్రధాన ప్లేయరే. స్ట్రైక్‌ బౌలర్‌, మంచి ప్రదర్శన ఇవ్వగలడు. కానీ టీమ్‌ అతని లేని లోటును అధిగమించడం సానుకూలాంశం. ఇలాంటి దెబ్బలను పట్టించుకోకూడదు. అతని స్థానంలో వచ్చిన మహ్మద్‌ షమి కూడా అనుభవజ్ఞుడే. మంచి సామర్థ్యం ఉంది. తాను బుమ్రాకు సరైన ప్రత్యామ్నాయమని అతడు నిరూపించాడు కూడా" అని సచిన్‌ చెప్పాడు.

WhatsApp channel