Ravindra Jadeja Training: గుడ్‌న్యూస్‌.. కోలుకున్న జడేజా.. మళ్లీ ట్రైనింగ్‌ షురూ-ravindra jadeja training started after knee surgery ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ravindra Jadeja Training: గుడ్‌న్యూస్‌.. కోలుకున్న జడేజా.. మళ్లీ ట్రైనింగ్‌ షురూ

Ravindra Jadeja Training: గుడ్‌న్యూస్‌.. కోలుకున్న జడేజా.. మళ్లీ ట్రైనింగ్‌ షురూ

Hari Prasad S HT Telugu
Oct 19, 2022 05:57 PM IST

Ravindra Jadeja Training: రవీంద్ర జడేజా కోలుకున్నాడు. మోకాలి సర్జరీ తర్వాత అతడు మళ్లీ ట్రైనింగ్‌ మొదలుపెట్టాడు. ఈ వీడియోను అతడు తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.

మోకాలికి సర్జరీ తర్వాత హాస్పిటల్ బెడ్ పై రవీంద్ర జడేజా
మోకాలికి సర్జరీ తర్వాత హాస్పిటల్ బెడ్ పై రవీంద్ర జడేజా (Ravindra Jadeja Instagram)

Ravindra Jadeja Training: టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మళ్లీ ట్రైనింగ్‌ ప్రారంభించాడు. మోకాలి గాయం, సర్జరీతో టీ20 వరల్డ్‌కప్‌కు దూరమైన అతడు.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా బుధవారం (అక్టోబర్‌ 19) తన ట్విటర్‌లో అతడు పోస్ట్‌ చేసిన వీడియోలో జడేజా జిమ్‌లో అటూఇటూ పరుగెత్తుతడం చూడొచ్చు.

ఆసియాకప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన జడేజా తర్వాత మోకాలి గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతని మోకాలికి సర్జరీ చేశారు. దీంతో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌లతోపాటు టీ20 వరల్డ్‌కప్‌కు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. తన సర్జరీ తర్వాత కూడా హాస్పిటల్‌ బెడ్‌పై ఉన్న ఫొటోను పోస్ట్‌ చేస్తూ తన గాయంపై అప్‌డేట్‌ ఇచ్చాడు.

"సర్జరీ విజయవంతమైంది. ఇందులో తనకు అండగా నిలిచిన టీమ్‌మేట్స్‌, సపోర్ట్‌ స్టాఫ్‌, ఫిజియోలు, డాక్టర్లు, అభిమానులు అందరికీ కృతజ్ఞతలు. త్వరలోనే రీహ్యాబిలిటేషన్‌ మొదలుపెట్టి తిరిగి క్రికెట్‌ ఆడతా. మీ విషెస్‌కు కృతజ్ఞతలు" అని అప్పట్లో జడేజా ట్వీట్ చేశాడు. ఇక తాజాగా జిమ్‌లో అటూ ఇటూ పరుగెత్తుతున్న వీడియోతో తాను గాయం నుంచి కోలుకున్నానన్న సందేశాన్ని పంపించాడు.

జడేజా దూరం కావడంతో అక్షర్‌ పటేల్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు. అతడు కూడా ఆల్‌రౌండ్‌ పర్ఫార్మెన్స్‌తో జడేజా స్థానాన్ని భర్తీ చేసినట్లే కనిపిస్తున్నాడు. జడేజా తర్వాత బుమ్రా కూడా గాయం కారణంగా వరల్డ్‌కప్‌కు దూరమైన విషయం తెలిసిందే. అతని స్థానంలో మహ్మద్‌ షమికి అవకాశం ఇచ్చారు. వరల్డ్‌కప్‌లో భాగంగా అక్టోబర్‌ 23న పాకిస్థాన్‌తో ఇండియా తన తొలి మ్యాచ్‌ ఆడనున్న విషయం తెలిసిందే.

WhatsApp channel