Ashwin Praises Kuldeep Yadav: దక్షిణాఫ్రికాతో మంగళవారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తన మణికట్టు మాయాజాలంతో కేవలం 18 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. కుల్దీప్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడిలో ఉన్న ప్రత్యేక లక్షమమే టీమిండియాలో అద్భుతమైన బౌలర్‌గా నిలబెడుతుందని తెలిపాడు.,"మణికట్టు స్పిన్నర్ల గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా కుల్దీప్ యాదవ్‌లో ఉన్న ప్రత్యేకమైన లక్షణం గుర్తుకువస్తుంది. ఒకే రకమైన లెంగ్త్‌తో బంతులను మళ్లీ మళ్లీ సంధించగలడమే అతడి ప్రత్యేక సామర్థ్యం. టెస్టు మ్యాచ్‌ల్లో అతడికి రివార్డులను తీసుకొస్తుంది ఈ సామర్థ్యమే. అతడు బంతిని తగిన సమయంలో అవసరమైన చోట ల్యాండ్ చేయగలడు. ఇది ఓ మణికట్టు స్పిన్నర్‌కు ఉండాల్సిన అద్భుతమైన లక్షణం. అదే అతడిని విలువైన స్పిన్నర్‌గా మారుస్తోంది." అని అశ్విన్ స్పష్టం చేశాడు.,దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ జట్టులో ఎంంపికైన కుల్దీప్ యాదవ్.. అద్భుత ప్రదర్శన చేశాడు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి ఆరు వికెట్లు తీశాడు. తొలి వన్డేలో 1/39, రెండో వన్డేలో 1/49. మూడో వన్డేలో 4/18తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్ జట్టులో లేకపోయినప్పటికీ.. అతడు తన దృష్టంతా 2023 వన్డే వరల్డ్ కప్‌పైనే పెట్టాడు.,మంగళవారం నాడు దక్షిణాఫ్రికాతో జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. 100 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇండియా 19.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. అంతకుముందు సిరీస్‌ను నిర్ణయించే కీలకమైన మూడో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ టీమ్ 27.1 ఓవర్లలో కేవలం 99 రన్స్‌కు ఆలౌటైంది. వన్డేల్లో ఇండియాపై సౌతాఫ్రికాకు ఇదే అతి తక్కువ స్కోరు కావడం విశేషం. టీమిండియా బౌలర్లు కుల్దీప్ 4 వికెట్లతో విజృంభించగా.. సుందర్, సిరాజ్, షాబాజ్ తలో రెండు వికెట్లు తీశారు.,