Ind vs SA 3rd ODI: సిరీస్‌ను నిర్ణయించే కీలకమైన మూడో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ టీమ్ 27.1 ఓవర్లలో కేవలం 99 రన్స్‌కు ఆలౌటైంది. వన్డేల్లో ఇండియాపై సౌతాఫ్రికాకు ఇదే అతి తక్కువ స్కోరు కావడం విశేషం. టీమిండియా బౌలర్లంతా చెలరేగిపోయారు. కుల్దీప్ 4, సుందర్, సిరాజ్, షాబాజ్ తలా రెండు వికెట్లు తీశారు.,సౌతాఫ్రికా చివరి 6 వికెట్లను కేవలం 33 పరుగుల తేడాలో కోల్పోవడం విశేషం. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో క్లాసెన్ 34 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మలన్ 15, యాన్సెన్ 14 రన్స్ చేయగా.. మిగతా ఏ బ్యాటర్ కూడా రెండంకెల స్కోరు అందుకోలేకపోయాడు. మూడో ఓవర్లో ఓపెనర్ డికాక్ (6) వికెట్ కోల్పోయిన ఆ టీమ్.. తర్వాత కోలుకోలేకపోయింది.,వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది. హెండ్రిక్స్ (3), మార్‌క్రమ్ (9), మిల్లర్ (7), విఫలమయ్యారు. మూడో ఓవర్లో డికాక్‌ను ఔట్ చేసి సుందర్ ఇండియన్ టీమ్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత సిరాజ్ రెండు వికెట్లు తీసి సఫారీలను దెబ్బ తీశాడు. ఇక టెయిలెండర్లను కుల్దీప్ ఔట్ చేశాడు. వన్డేల్లో సౌతాఫ్రికాకు ఇండియాపై ఇదే అత్యల్ప స్కోరు కాగా.. ఓవరాల్‌గా ఈ ఫార్మాట్‌లో నాలుగో అత్యల్ప స్కోరు.,ఆ టీమ్ 1993లో ఆస్ట్రేలియాపై 63 రన్స్‌కే ఆలౌట్ కాగా.. ఆ తర్వాత ఇంగ్లండ్‌పై 2008లో ఒకసారి, 2022లో మరోసారి 83 రన్స్‌కే ఆలౌటైంది. ఆ తర్వాత 100లోపు స్కోరుకు చాప చుట్టేయడం ఈసారే.