T20 Cricket : అయ్యయ్యో.. ఈ రికార్డు మనకెందుకయ్యా-most no balls record in t20 format on arshdeep singh ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  T20 Cricket : అయ్యయ్యో.. ఈ రికార్డు మనకెందుకయ్యా

T20 Cricket : అయ్యయ్యో.. ఈ రికార్డు మనకెందుకయ్యా

Anand Sai HT Telugu
Jan 29, 2023 09:13 AM IST

T2o Cricket No Balls : టీ20 ఫార్మాట్లో నో బాల్స్ వేస్తే.. కష్టమే. కానీ కొన్నిసార్లు తప్పదు.. అలా పడిపోతుంటాయి. అయితే ఈ ఫార్మాట్ లో ఎక్కువ నో బాల్స్ వేసింది మాత్రం మనోడే. నమ్మట్లేదా.. ఇది నిజం.

అర్షదీప్  సింగ్
అర్షదీప్ సింగ్ (AFP)

ఏ ఫార్మాట్ అయినా.. నో బాల్ వేస్తే.. అంతే బ్యాటర్ చేతికి ఓ బంతి చిక్కినట్టే.. సరిగా ఉపయోగిస్తే.. సిక్స్ పడినట్టే. ఇక బ్యాంటిగ్ చేసే జట్టు స్కోర్ బోర్డు ఓ మెట్టు పైకి ఎక్కినట్టే. నో బాల్ పడిందా.. ఇక ఫిల్డింగ్ చేసే వాళ్లంతా.. తలలు పట్టుకోవాల్సిందే. అందుకే సాధ్యమైనంత వరకూ బౌలర్స్ నో బాల్స్ పడకుండా చూసుకుంటారు. కానీ కొన్నిసార్లు తప్పదు పడిపోతూ ఉంటాయి. సరే ఇదంతా పక్కన పెడితే.. టీ20 ఫార్మాట్ లో నో బాల్స్ అత్యధికంగా వేసిన బౌలర్ ఎవరో తెలుసా? ఇండియా ఆటగాడే.

టీ20 ఫార్మాట్లో నో బాల్స్ అత్యధికంగా వేసిన ఆటగాడిగా ఇండియా బౌలర్ పేరు టాప్ లో ఉంది. టీమిండియా(Team India) యంగ్ బౌలర్ అర్షదీప్ సింగ్(Arshdeep Singh) పేరు మీద ఈ చెత్త రికార్డు ఉంది. ఇప్పటి వరకు అతడు 24 ఇన్సింగ్స్ లలో ఆడి 14 నో బాల్స్ వేసి రికార్డు నమోదు చేశారు. న్యూజిలాండ్(New Zealand)తో శుక్రవారం జరిగిన ఇన్సింగ్స్ లో చివరి ఓవర్లో నో బాల్ వేశాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో అత్యధిక నో బాల్స్ వేసిన బౌలర్ గా అర్షదీప్ టాప్ లోకి ఉన్నాడు.

ఇక అర్షదీప్ తర్వాతి స్థానం చూసుకుంటే.. పాకిస్థాన్ బౌలర్ హసన్ అలీ(hasan ali) ఉన్నాడు. అతడు తొమ్మిది ఇన్సింగ్స్ లలో 11 నో బాల్స్(No Balls) వేశాడు. మరోవైపు ఆరు ఇన్నింగ్స్ లలో వెస్టిండీస్ బౌలర్ కీమో పాల్ 11 నో బాల్స్ వేసేశాడు. ఆ తర్వాతి స్థానంలో ఒషానే థామస్ 11 నో బాల్స్ ఉన్నాడు. రిచర్డ్ నగరావా 10 నో బాల్స్ కంప్లీట్ చేశాడు..

అయితే మరో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో నో బాల్ వేయని బౌలర్లు కూడా ఉన్నారు. వారిలో భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్(Kapil Dev) ఉన్నాడు. 131 టెస్టులు, 225 వన్డేలు ఆడి ఒక్క నో బాల్ కూడా వేయలేదు. 79 టెస్టులు, మూడు వన్డేలు ఆడిన వెస్టిండీస్ స్పిన్నర్ లాన్సే గిబ్స్ కూడా తన కెరీర్ లో ఒక్క నో బాల్ పడలేదట. ఇంగ్లండ్ మాజీ ఆల్ రౌండర్ ఇయాన్ బోథాం, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ, పాకిస్థాన్ మాజీ పాస్ట్ బౌలర్ ఇమ్రాన్ ఖాన్ కూడా నో బాల్ వేయని లిస్టులో ఉన్నారు.

నో బాల్ రికార్డులో అర్షదీప్ ఉండేసరికి కొంతమంది క్రికెట్ లవర్స్(Cricket Lovers) హర్ట్ అవుతున్నారు. మెున్న న్యూజిలాండ్ జట్టుతో టీ20 మ్యాచ్ ను కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఆ మ్యాచ్ లో భారత్ జట్టు 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అర్షదీప్ వేసిన లాస్ట్ ఓవర్‌లో న్యూజిలాండ్ జట్టు ఏకంగా 27 పరుగులు చేసింది. 19 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్ 149 మాత్రమే ఉండేది. చివరి ఓవర్లో అర్షదీప్ నో బాల్ వేయడంతో తొలి రెండు బంతుల్లోనే భారీగా పరుగులు ఇచ్చేశాడు. దీంతో ఆ ఓవర్లో 27 పరుగులు చేసిన కివీస్ జట్టు.. 176 పరుగులు చేయగలిగింది.

WhatsApp channel