IND vs BAN 3rd Odi: ఇషాన్ డ‌బుల్ సెంచ‌రీ కోహ్లి సెంచ‌రీ - మూడో వ‌న్డేలో బంగ్లాదేశ్‌ టార్గెట్ 410 ర‌న్స్‌-ishan kishan shines with double century as india set huge target against bangladesh in 3rd odi ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ishan Kishan Shines With Double Century As India Set Huge Target Against Bangladesh In 3rd Odi

IND vs BAN 3rd Odi: ఇషాన్ డ‌బుల్ సెంచ‌రీ కోహ్లి సెంచ‌రీ - మూడో వ‌న్డేలో బంగ్లాదేశ్‌ టార్గెట్ 410 ర‌న్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Dec 10, 2022 03:41 PM IST

IND vs BAN 3rd Odi: బంగ్లాదేశ్‌తో జ‌రుగుతోన్న మూడో వ‌న్డేలో టీమ్ ఇండియా యాభై ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్లు న‌ష్ట‌పోయి 409 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. ఇషాన్ కిష‌న్ డ‌బుల్ సెంచ‌రీ చేయ‌గా, కోహ్లి సెంచ‌రీతో స‌త్తా చాటాడు.

ఇషాన్ కిష‌న్‌, విరాట్ కోహ్లి
ఇషాన్ కిష‌న్‌, విరాట్ కోహ్లి

IND vs BAN 3rd Odi: ఇషాన్ కిష‌న్ (Ishan kishan), కోహ్లి (Virat kohli) ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో బంగ్లాదేశ్‌తో జ‌రుగుతోన్న మూడో వ‌న్డేలో టీమ్ ఇండియా యాభై ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 409 ప‌రుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిష‌న్ డ‌బుల్ సెంచ‌రీతో మెర‌వ‌గా కోహ్లి సెంచ‌రీ చేశాడు. ఇషాన్ కిష‌న్ 131 బాల్స్‌లో ప‌ది సిక్స‌ర్లు, 24 ఫోర్ల‌తో 210 ర‌న్స్ చేశాడు. విరాట్ కోహ్లి 91 బాల్స్‌లో 2 సిక్స‌ర్లు, 11 ఫోర్ల‌తో 113 ర‌న్స్ చేశాడు. రెండో వికెట్‌కు ఇషాన్‌, కోహ్లి క‌లిసి 290 ప‌రుగులు జోడించారు.

అంత‌కుముందు టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ గాయ‌ప‌డంతో అత‌డి స్థానంలో ఇషాన్ కిష‌న్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. ధావ‌న్‌తో క‌లిసి ఇండియా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ధావ‌న్ 3 ప‌రుగుల‌కు ఔట్ నిరాశ‌ప‌రిచాడు.

కోహ్లితో క‌లిసి ఇషాన్ బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. వీరిద్ద‌రు ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ‌టంతో స్కోరు బోర్డు ప‌రుగులు పెట్టింది. వీరిద్ద‌రి మెరుపుల‌తో టీమ్ ఇండియా భారీ స్కోరు చేసింది. ఒకానొక ద‌శ‌లో 35 ఓవ‌ర్ల‌లోనే మూడు వంద‌లు స్కోరు దాట‌డంతో టీమ్ ఇండియా ఐదు వంద‌ల ప‌రుగులు చేసేలా క‌నిపించింది.

ఇషాన్ కిష‌న్‌, కోహ్లి వెంట‌వెంట‌నే ఔట్ కావ‌డం, మిగిలిన బ్యాట్స్‌మెన్స్ విఫ‌లం కావ‌డంతో టీమ్ ఇండియా 409 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది. వాషింగ్ట‌న్ సుంద‌ర్ (37 ర‌న్స్‌), అక్షర్ ప‌టేల్ (20 ప‌రుగులు) చేశారు. బంగ్లాబౌల‌ర్ల‌లో ష‌కీబ్‌, హుస్సైన్‌, టాస్కిన్ అహ్మ‌ద్ త‌లో రెండు వికెట్లు తీసుకున్నారు.

WhatsApp channel