ICC Women World Cup: 2025 ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌నకు భారత్ ఆతిథ్యం -india to host icc 2025 women s world cup tournament ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  India To Host Icc 2025 Women's World Cup Tournament

ICC Women World Cup: 2025 ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌నకు భారత్ ఆతిథ్యం

Maragani Govardhan HT Telugu
Jul 27, 2022 06:34 AM IST

2025లో జరగనున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఆతిథ్య మివ్వనుంది. ఈ విషయాన్ని ఐసీసీ ఓ ప్రకటనలో తెలియజేసింది. 2024 నుంచి 2027 వరకు నాలుగు ఐసీసీ మహిళల టోర్నమెంట్లు జరగనున్నాయి.

ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025కు భారత్ వేదిక
ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025కు భారత్ వేదిక (HT)

మహిళల ప్రపంచకప్‌కు భారత్ మరోసారి ఆతిథ్యమివ్వనుంది. 2025లో జరగనున్న ఐసీసీ వుమెన్స్ వరల్డ్ కప్ టోర్నీకి భారత్‌లో జరగనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం ప్రకటించింది. గత దశాబ్ద కాలంలో ఈ టోర్నీకి ఇండియా ఆతిథ్యమివ్వడంతో ఇదే తొలిసారి. 2013లో మహిళల ప్రపంచకప్‌ ఇక్కడ జరిగింది. మొత్తంగా చూసుకుంటే భారత్ నాలుగోసారి ఆతిత్యమిస్తుంది. ఇప్పటికే 2024లో జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ బంగ్లాదేశ్‌లో జరగనుంది. దీంతో 2024 నుంచి 2027 వరకు నాలుగేళ్లలో మహిళలకు సంబంధించిన నాలుగు ఐసీసీ టోర్నీలు జరగనున్నాయి.

"బంగ్లాదేశ్ ఐసీసీ మహిళల టోర్నీకి ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారు. టీ20 ప్రపంచకప్‌ అయితే రెండో సారి అక్కడ నిర్వహిస్తున్నారు. 2024 సెప్టెంబరు-అక్టోబరు మధ్య ఈ టోర్నీ జరుగుతుంది. 10 జట్లు 23 మ్యాచ్‌లు ఆడతాయి. ఇది జరిగిన ఏడాది తర్వాత ఐసీసీ మహిళల 50 ఓవర్ల ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహిస్తారు. దీంతో భారత్ ఐదో సారి ఐసీసీ మహిళల టోర్నీకి ఆతిథ్యమిస్తుంది. ఇప్పటివరకు నాలుగు సార్లు ఇండియా హోస్ట్ చేసింది. 2025 ప్రపంచకప్‌లో మొత్తం 8 జట్లు పోటీ పడతాయి. 31 మ్యాచ్‌లు జరుగుతాయి." అని ఐసీసీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే 2026 టీ20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్‌లో జరగనుంది. ఈ దేశంలో తొలిసారి ఈ టోర్నీ జరగనుంది. జట్లు కూడా 10 నుంచి 12 వరకు పెరగనున్నాయి. మొత్తం 33 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ సైకిల్‌లో ఫైనల్ ఈవెంట్ వచ్చేసి 2027 మహిళల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. ఈ టోర్నీకి శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. తొలిసారి జరగనున్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీని టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 2026 నుంచి ఆరు జట్లు 16 మ్యాచ్‌లు ఆడనున్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం