ICC T20 Cricketer of the Year Nominees: ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ రేసులో సూర్యకుమార్, స్మృతి మంధానా
ICC T20 Cricketer of the Year Nominees: ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ రేసులో సూర్యకుమార్, స్మృతి మంధానా నిలిచారు. ఈ ఇద్దరినీ గురువారం (డిసెంబర్ 29) నామినేట్ చేశారు.
ICC T20 Cricketer of the Year Nominees: ఇండియన్ మెన్స్, వుమెన్స్ టీమ్స్ ప్లేయర్స్ అయిన సూర్యకుమార్ యాదవ్, స్మృతి మంధానా ఈ ఏడాది ఐసీసీ అత్యుత్తమ అవార్డుల రేసులో ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌కు నామినేట్ కాగా.. స్మృతి మంధానా వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌కు నామినేట్ అయింది.
మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ రేసులో సూర్యకుమార్‌తోపాటు జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్, పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఉన్నారు. ఇక స్మృతి మంధానాతోపాటు వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ రేసులో పాకిస్థాన్ ఆల్‌రౌండర్ నిదా దర్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ తహ్లియా మెక్‌గ్రాత్ నిలిచారు.
సూర్యకుమార్ యాదవ్ 2022లో టాప్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో ఈ ఏడాది వెయ్యికి పైగా రన్స్ చేసిన ఇద్దరు బ్యాటర్లలో సూర్య ఒకడు. అంతేకాదు ఈ ఫార్మాట్‌లో 2022లో 1164 రన్స్‌తో టాప్‌లో నిలిచాడు. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 187.43 కావడం విశేషం. ఇక ఈ ఫార్మాట్‌లో 2022లో 68 సిక్స్‌లు బాదాడతడు. ఏ ఇతర బ్యాటర్ ఇన్ని సిక్స్‌లు కొట్టలేదు.
అంతేకాదు టీ20ల్లో 45 సగటుతో సూర్య పరుగులు చేశాడు. రెండు సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక టీ20 వరల్డ్‌కప్‌లోనూ సూర్య ఆరు ఇన్నింగ్స్‌లో మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. సగటు 60, స్ట్రైక్‌రేట్ 189 కావడం విశేషం. వరల్డ్‌కప్ తర్వాత న్యూజిలాండ్‌పై కూడా సెంచరీ బాదాడు. ఇదే ఏడాది టీ20ల్లో నంబర్ వన్ ర్యాంక్ కూడా అందుకున్నాడు.
అటు స్మృతి మంధానా కూడా 2022లో టీ20ల్లో 23 మ్యాచ్‌లలో 594 రన్స్ చేసింది. ఈ ఏడాది 23 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ చేసి.. ఇండియా తరఫున మహిళల టీ20ల్లో అత్యంత వేగంగా ఫిఫ్టీ మార్క్ అందుకున్న ప్లేయర్‌గా నిలిచింది. అంతేకాదు టీ20ల్లో 2500 రన్స్ కూడా పూర్తి చేసింది. కామన్వెల్త్ గేమ్స్, వుమెన్స్ ఆసియాకప్‌లలో రాణించింది.
సంబంధిత కథనం